Rajasthan: ఉదయ్‌పూర్ లో 24 గంటల పాటు ఇంటర్నెట్ సేవలు బంద్‌..ఎందుకంటే!

ఉదయ్ పూర్‌ లో 24 గంటల పాటు ఇంటర్నెట్ సేవలను బంద్‌ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఓ ప్రభుత్వ పాఠశాలలో 10 వ తరగతి విద్యార్థిని మరో విద్యార్థి కత్తితో పొడవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో..పరిస్థితులను అదుపులో ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

New Update
Rajasthan: ఉదయ్‌పూర్ లో 24 గంటల పాటు ఇంటర్నెట్ సేవలు బంద్‌..ఎందుకంటే!

Rajasthan: రాజస్థాన్‌ లోని ఉదయ్ పూర్‌ లో 24 గంటల పాటు ఇంటర్నెట్ సేవలను బంద్‌ చేస్తూ డివిజనల్‌ కమిషనర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఓ ప్రభుత్వ పాఠశాలలో 10 వ తరగతి విద్యార్థిని మరో విద్యార్థి కత్తితో పొడవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. దీంతో నగరంలో శాంతిభద్రతల పరిస్థితులను అదుపులో ఉంచేందుకు కమిషనర్‌ కార్యాలయం ఇంటర్నెట్ సేవలను నిలిపేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.

దీని గురించి మాట్లాడిన ఉదయ్‌పూర్ జిల్లా కలెక్టర్ అరవింద్ పోస్వాల్.. శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఇద్దరు పిల్లల మధ్య గొడవ జరిగినట్టు సమాచారం ఉంది. దీంతో ఆవేశంలో ఓ పిల్లవాడు మరో విద్యార్థి తొడలపై కత్తితో తీవ్రంగా దాడి చేయడంతో గాయం లోతుగా అయ్యింది. వెంటనే విద్యార్థిని ఆసుపత్రికి తీసుకుని వెళ్లినట్లు కలెక్టర్ తెలిపారు.

తాను బాధిత చిన్నారిని కలిశానని..ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉంది. ఘటనకు సంబంధించిన కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని కలెక్టర్‌ వివరించారు. దీనిపై ఎలాంటి తప్పుడు సమాచారాన్ని పట్టించుకోవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కత్తితో దాడి చేసిన విద్యార్థిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొననారు. అతని తండ్రిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారని ' చెప్పారు. ఈ ఘటనలో మరేవరిదైనా ప్రమేయం ఉందా అనే దిశగా దర్యాప్తు కొనసాగుతుందన్నారు. నగరంలో శాంతిభద్రతలను కాపాడటం తమ కర్తవ్యమని కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు.

Also Read: గుండెపోటుతో అమెరికాలో తెలంగాణ యువకుడి మృతి!

Advertisment
తాజా కథనాలు