నేడు వరల్డ్ హార్ట్ డే.. ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ గుండె సేఫ్!

గుండె ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రపంచ వ్యాప్తంగా నేడు వరల్డ్ హర్ట్ డేను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ ఏడాది యూజ్ హార్ట్ ఫర్ యాక్షన్ అనే థీమ్‌తో ప్రపంచ వ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

New Update
ఆహారపు అలవాట్లతోనే గుండెపోటు వస్తుందా?

World Heart Day 2024: ఉరుకుల పరుగుల జీవితంలో వయస్సుతో పని లేకుండా ప్రతి ఒక్కరూ గుండె జబ్బుల బారిన పడుతున్నారు. గుండె ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రతీ ఏడాది సెప్టెంబర్ 29న వరల్డ్ హార్ట్ డేను ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. హృదయ సంబంధ వ్యాధులు రాకుండా ఆరోగ్యమైన జీవితాన్ని గడపాలని ఈ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. దీని వెనుక ఉన్న చరిత్ర ఏంటి? ఈ ఏడాది థీమ్ ఏంటి? ఎలా జరుపుకోవాలో తెలుసుకుందాం. 

చరిత్ర

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సాయంతో వరల్డ్ హార్ట్ ఫెడరేషన్‌ను 1999లో ఏర్పాటు చేశారు. దీనిని 2000 సెప్టెంబర్ 24న జరిగింది. ఆ తర్వాత ప్రపంచ హృదయ దినోత్సవాన్ని సెప్టెంబర్ చివరి ఆదివారం జరుపుకునేవారు. కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సెప్టెంబర్ 29న జరుపుకోవాలని నిర్ణయించింది. అప్పటి నుంచి ప్రతి ఏటా ఈ తేదీనే ప్రపంచ హృదయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 

థీమ్

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని యూజ్ హార్ట్ ఫర్ యాక్షన్ అనే థీమ్‌తో ఈ ఏడాది జరుపుకుంటున్నారు. హృదయ ఆరోగ్యాన్ని సీరియస్‌గా తీసుకుంటూ అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ థీమ్‌ పెట్టారు. 

ఇలా జరుపుకోండి

గుండె జబ్బులపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. ప్రపంచ హృదయ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకోవాలి. గుండె ప్రమాదాలు రాకుండా ఎలా ఉండాలో తెలుపుతూ కార్యక్రమాలు, వెబినార్, సోషల్ మీడియాలో అవగాహన వీడియోలు వంటివి చేయాలి. గుండె ఆరోగ్యానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రజల్లో అవగాహన కల్పించాలి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే డైలీ వర్క్‌వుట్స్ చేయాలి. కనీసం పది నిమిషాలు అయిన వ్యాయామం, యోగా, మెడిటేషన్ వంటివి చేస్తుండాలి. జంక్ ఫుడ్‌కి దూరంగా ఉంటూ పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. మద్యం, ధూమపానం, ఒత్తిడి వంటి వాటికి దూరంగా ఉంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు