BIG BREAKING: బ్రిడ్జ్ కూలి 12 మంది కార్మికులు మృతి

చైనాలో భారీ ప్రమాదం సంభవించింది. సిచువాన్-క్వింగ్‌హై రైల్వే ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న ఓ భారీ రైల్వే బ్రిడ్జ్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో 12 మంది కార్మికులు మరణించారు. మరో నలుగురు గల్లంతయ్యారు. ఈ ఘటన చైనా టైం ప్రకారం శుక్రవారం చోటుచేసుకుంది.

New Update
Bridge collapses in china

China railway bridge

చైనాలో భారీ ప్రమాదం సంభవించింది. సిచువాన్-క్వింగ్‌హై రైల్వే ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న ఓ భారీ రైల్వే బ్రిడ్జ్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో 12 మంది కార్మికులు మరణించారు. మరో నలుగురు గల్లంతయ్యారు. ఈ ఘటన చైనా టైం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున జరిగిందని అధికారులు వెల్లడించారు.

యెల్లో రివర్ (హ్వాంగ్ హే) నదిపై నిర్మిస్తున్న ఈ వంతెన ప్రధాన ఆర్చ్ భాగం ఒక్కసారిగా కుప్పకూలి నదిలో పడిపోయింది. స్టీల్ కేబుల్ తెగిపోవడమే ఈ దుర్ఘటనకు ప్రాథమిక కారణమని చైనా ప్రభుత్వ వార్తా సంస్థ జిన్హువా తెలిపింది. ప్రమాదం జరిగిన సమయంలో వంతెన నిర్మాణ ప్రదేశంలో మొత్తం 16 మంది కార్మికులు ఉన్నారని 'పీపుల్స్ డైలీ' వెల్లడించింది.

కూలిపోయిన వంతెన ప్రపంచంలోనే అతిపెద్ద డబుల్-ట్రాక్ స్టీల్ ట్రస్ ఆర్చ్ రైల్వే వంతెన. ఈ ప్రాజెక్టు 2025 ఆగస్టులో పూర్తి కావాల్సి ఉంది. చైనాలో రెండో అతిపెద్ద నది అయిన యెల్లో రివర్ మీద నిర్మిస్తున్న తొలి రైల్వే స్టీల్ ట్రస్ ఆర్చ్ బ్రిడ్జి కూడా ఇదే.

ప్రమాదం జరిగిన వెంటనే వందలాది మంది సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గల్లంతైన నలుగురు కార్మికుల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై విచారణకు చైనా అత్యవసర నిర్వహణ మంత్రిత్వ శాఖ ఒక బృందాన్ని పంపింది. ప్రమాదానికి గల కారణాలను త్వరగా వెలికితీయాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

చైనాలో నిర్మాణ రంగంలో భద్రతా ప్రమాణాలు తరచుగా బలహీనంగా ఉంటాయని, దీనివల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయని విమర్శలు ఉన్నాయి. గతంలో కూడా అనేక నిర్మాణ ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం సంభవించింది. 

Advertisment
తాజా కథనాలు