Telangana: గతేడాది అక్టోబర్ లో అమెరికాలోని ఇండియానాలో తెలంగాణ విద్యార్థి వరుణ్ రాజ్ హత్య కు గురైయ్యాడు. ఈ క్రమంలో వరుణ్ ని చంపిన నిందితుడికి కోర్టు 60 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. పోర్టర్ టౌన్‌షిప్‌కు చెందిన 25 ఏళ్ల జోర్డాన్ ఆండ్రేడ్.. తెలంగాణకు చెందిన గ్రాడ్యుయేట్ విద్యార్థి వరుణ్ రాజ్ పుచ్చాను దారుణంగా కత్తితో పొడిచి చంపేశాడు.
Also Read: తాకితే నరికేయండి.. అమ్మాయిలకు కత్తులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
60 సంవత్సరాల జైలు శిక్ష...
ఈ క్రమంలో అతనికి పోర్టర్ సుపీరియర్ కోర్ట్ జడ్జి జెఫ్రీ క్లైమర్ గురువారం మధ్యాహ్నం 60 సంవత్సరాల జైలు శిక్షను విధించారు. ఆండ్రేడ్ తన శిక్షను సాంప్రదాయ జైలులో లేదా మానసిక ఆరోగ్య సదుపాయంలో అనుభవిస్తారా అనేది ఇండియానా డిపార్ట్‌మెంట్ ఆఫ్ కరెక్షన్ పై ఆధారపడి ఉంటుంది. ఈ విషయంపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు.
Also Read: బాంబు బెదిరింపులు.. ఢిల్లీలో అత్యవసర ల్యాండింగ్
వరుణ్ రాజ్ హత్య ఘటన గత ఏడాది అక్టోబర్ 29న వాల్పరైసోలోని ప్లానెట్ ఫిట్‌నెస్ జిమ్‌లో ఈ దారుణ హత్య జరిగింది. అక్కడ ఆండ్రేడ్ వరుణ్ పై దాడి చేసి, కత్తితో తలపై పొడిచాడు. వాల్పరైసో యూనివర్శిటీలో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న వరుణ్.. తొమ్మిది రోజుల తర్వాత ఫోర్ట్ వేన్‌లోని ఆసుపత్రిలో మరణించాడు.
Also Read: Hyderabad - Vijayawada Highway పై కిలోమీటర్ల మేర బారులు తీరిన వాహనాలు
మరో రెండు నెలల్లో వరుణ్ తన మాస్టర్స్ పూర్తి చేస్తాడు అనగా ఈ దారుణం జరిగింది. బైపోలార్ డిజార్డర్, స్కిజోఫ్రెనియాతో బాధపడుతున్న నిందితుడు ఆండ్రేడ్ దాడికి ముందు మానసిక ఆరోగ్య చికిత్సను కోరాడు. అయినప్పటికీ, హింసాత్మక సంఘటన కేవలం నెలల తర్వాత సంభవించింది. శిక్ష సమయంలో, ఆండ్రేడ్ తండ్రి జో ఆండ్రేడ్ తీవ్ర పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేశాడు.
Also Read: మూసీలో కూల్చివేతలు...రేపటి నుంచే!