ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో పేలుళ్లు..

డెన్మార్క్ రాజధాని నగరం కొపెన్‌హాగన్‌లోని ఇజ్రాయెల్ రాయభార కార్యాలయం సమీపంలో రెండు పేలుళ్లు సంభవించాయి. అయితే ఈ దాడుల్లో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని పోలీసులు తెలిపారు.

Israel embassy
New Update

హమాస్, హెజ్బుల్లా మీద ఇజ్రాయెల్ దాడులకు దిగింది. ఇందులో భాగంగానే హెజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను ఇజ్రాయెల్ హతమార్చింది. దీంతో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా హమాస్, హెజ్బుల్లాకు ఇరాన్ మద్ధతు ఇచ్చింది. ఇందులో భాగంగానే ఇజ్రాయెల్‌పై దాడులకు దిగింది. ప్రస్తుతం ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య యుద్ధపోరు తీవ్రంగా మారింది. నువ్వా నేనా అన్నట్లుగా మారింది. నువ్వు 10 బాంబులు ప్రయోగిస్తే.. దానికి రెట్టింపు బాంబులు నేను ప్రయోగిస్తానంటూ రెండు దేశాలు రెచ్చిపోతున్నాయి.

అయితే ఇప్పటి వరకు ఈ రెండు దేశాల మధ్య శత్రుత్వం ఉన్నా.. ఏనాడు ఒకదానిపై మరొకటి దాడులు చేసుకోలేదు. కానీ ఇప్పుడు ఈ రెండు దేశాలు ప్రత్యక్షంగా దాడులకు దిగాయి. ఇందులో భాగంగానే డెన్మార్క్ రాజధాని నగరం కొపెన్‌హాగన్‌లోని ఇజ్రాయెల్ రాయభార కార్యాలయం సమీపంలో రెండు పేలుళ్లు సంభవించాయి. అయితే ఈ దాడుల్లో ఎలాంటి గాయాలు కాలేదు. ఈ రెండు పేలుళ్లపై కోపెన్‌హాగన్ పోలీసులు దర్యాప్తు చేయడం ప్రారంభించారు. 

ఇందులో భాగంగానే ఈ రెండు పేలుళ్ల ఆధారంగా స్ట్రాండగెర్వేజ్/ లుండెవాంగ్స్వేజ్ ప్రాంతంలో ఉన్నామని.. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపారు. ప్రస్తుతం సంఘటన స్థలంలో ప్రాథమిక పరిశోధనలు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. 

హెజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను ఇజ్రాయెల్ హతమార్చడంతో దీనికి ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయెల్ పై క్షిపణులను ప్రయోగించింది. ఇది అంతకంతకు మరింత విస్తృతమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ఇజ్రాయెల్‌కు హెచ్చరించారు. ఇరాన్ ప్రజలు, వారి రక్షణను దృష్టిలో ఉంచుకుని ఇజ్రాయెల్‌పై దాడులు మొదలెట్టినట్లు తెలిపారు. 

ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకోకుండా ఉంటే తమ దాడులు ఆగినట్లేనని చెప్పారు. అలా కాదు కూడదు.. మా పంతం నెగ్గించుకుంటామని ప్రయత్నిస్తే.. తిరిగి మళ్లీ దాడులు మొదలెడతామని ఇది శాంపుల్ మాత్రమేనని హెచ్చరించారు. కాగా ఈ రెండు దేశాల్లో ఇరాన్ పప్రంచ సైనిక బలం విషయంలో 14వ స్థానంలో ఉంది. అదే సమయంలో ఇజ్రాయెల్ 17వ స్థానంలో ఉంది. దీని బట్టి చూస్తే ఎవరిది పై చేయి అనేది అర్థమైపోతుంది. 

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe