/rtv/media/media_files/2025/01/21/EUNN7jtk4OKx3604BuOw.jpg)
rump pardons 1,500 individuals Photograph: (rump pardons 1,500 individuals)
అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నారు. తాజాగా ఆయన 2021 జనవరి 6న అమెరికా క్యాపిటల్ భవనంపై జరిగిన దాడి ఘటనలో పాల్గొన్న 1500 మందికి క్షమాభిక్ష పెట్టారు. అంతేకాకుండా ఆరుగురి శిక్షలను కూడా తగ్గించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ట్రంప్ సంతకం కూడా చేశారు. దీంతో ఈ రోజు రాత్రికి వారు జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. అల్లర్లకు సంబంధించిన అన్ని పెండింగ్ కేసులను ఉపసంహరించుకోవాలని యూఎస్ అటార్నీ జనరల్‌ను కూడా నిర్దేశించారు. ఆ అల్లర్లలో పాల్గొన్న తన మద్దతుదారులను విడుదల చేస్తానని ఎన్నికల టైమ్ లో ట్రంప్ ప్రకటించగా తాజాగా ఆ దిశగానే ఆయన నిర్ణయం తీసుకున్నారు.
కాగా 2020లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయారు. అనంతరం 2021 జనవరి 6న అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ విజయాన్ని ధ్రువీకరించేందుకు వాషింగ్టన్ క్యాపిటల్ భవనంలో కాంగ్రెస్ సమావేశమైంది. అయితే ఆ సమావేశం జరగడానికి కొన్ని గంటల ముందు ట్రంప్ తన మద్దతుదారులను ఉద్దేశిస్తూ ప్రసంగించారు. అనంతరం ట్రంప్ మద్దతుదారులు వేలాదిగా క్యాపిటల్ భవనంలోకి వెళ్లి విధ్వంసం సృష్టించారు. ఈ దాడిలో 140 మందికి పైగా పోలీసు అధికారులు గాయపడ్డారు, ఇది యునైటెడ్ స్టేట్స్‌లో చట్టాన్ని అమలు చేసే అధికారులపై జరిగిన అతిపెద్ద సామూహిక దాడుల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు.
ఐదుగురికి క్షమాభిక్ష
ఇక అధికారం నుంచి దిగిపోయే 20 నిమిషాల ముందు అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ తన కుటుంబానికి చెందిన ఐదుగురికి క్షమాభిక్షను ప్రసాదించారు. వారు ఎలాంటి తప్పు చేయలేదని, ట్రంప్ రాజకీయ దాడులకు బలవుతారనే భయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. క్షమాభిక్ష పొందినవారిలో బైడెన్ సోదరుడు జేమ్స్, అతడి భార్య సారా, బైడెన్ సోదరి వలేరి, ఆమె భర్త జాన్, బైడెన్ మరో సోదరుడు ఫ్రాన్సిస్ ఉన్నారు. 2024 డిసెంబర్ లోనూ తన కుమారుడికి క్షమాభిక్ష ప్రకటించారు బైడెన్.
Also Read : ఇంట్లో వాళ్లతో ఫైట్ చేసి... ప్రియురాలితో పెళ్లి కోసం ముస్లిం నుంచి హిందూమతంలోకి