Saudi Arabia : అమ్మానాన్నలను నరికేసి.. హాయిగా లంచ్ చేసి..వామ్మో వీడెం పిల్లాడురో!

సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో దారుణం జరిగింది.రాజమండ్రికి చెందిన ఒక టీనేజర్ తన కన్నతల్లిదండ్రులను అత్యంత దారుణంగా హత్య చేసి, ఆ తర్వాత తానూ ప్రాణాలు తీసుకున్నాడు.

New Update
nri

సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో దారుణం జరిగింది.రాజమండ్రికి చెందిన ఒక టీనేజర్ తన కన్నతల్లిదండ్రులను అత్యంత దారుణంగా హత్య చేసి, ఆ తర్వాత తానూ ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా ఉన్న భారతీయులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

వివరాల్లోకి వెళ్తే..  రాజమండ్రికి చెందిన గాలి రవి, గాలి శ్రీదేవి దంపతులు గత కొన్నేళ్లుగా రియాద్‌లో ఉంటున్నారు. రవి అక్కడ ఒక బ్యాంకులో పని చేస్తుండగా, శ్రీదేవి ఇండియన్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నారు. వీరికి 12 ఏళ్ల యెజ్ర ప్రభాకర్ అనే ఒక్కగానొక్క కొడుకు ఉన్నాడు. గురువారం రాత్రి ప్రభాకర్ తన తల్లిదండ్రులను కత్తితో నరికి చంపేశాడు. 

శవాలు ఇంట్లో ఉండగానే

అంతటితో ఆగకుండా, తల్లిదండ్రుల శవాలు ఇంట్లో ఉండగానే ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ ఇచ్చి తెప్పించుకున్నాడు. ప్రశాంతంగా లంచ్ పూర్తి చేసిన తర్వాత, తానూ బలవన్మరణానికి పాల్పడ్డాడు. అసలు ఆ చిన్న వయసులో అంతటి కోపం ఎందుకు వచ్చింది? అంత క్రూరంగా ఎలా ప్రవర్తించాడు? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. గారాబంగా పెంచుకున్న కొడుకే ఇలా ప్రాణాలు తీయడంతో రాజమండ్రిలోని వారి బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ప్రధాన కారణం ఆన్‌లైన్ గేమ్స్

12 ఏళ్ల యెజ్ర ప్రభాకర్ ఈ ఘాతుకానికి పాల్పడటానికి ప్రధాన కారణం ఆన్‌లైన్ గేమ్స్ అని తేలింది. ప్రభాకర్ ఆన్‌లైన్ గేమ్స్‌కు విపరీతంగా బానిసయ్యాడు. ఈ గేమ్స్ ఆడేందుకు అవసరమైన ఖరీదైన పరికరాల కోసం తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చి దాదాపు 5 లక్షల రూపాయలు ఖర్చు చేయించాడు. 

ప్రస్తుతం అతను ప్లస్ 2 చదువుతున్నాడు. పరీక్షలు జరుగుతున్నా కూడా చదువు పక్కన పెట్టి రోజంతా ఆన్‌లైన్ గేమ్స్‌లోనే మునిగిపోయేవాడు. దీంతో తండ్రి రవి, తల్లి శ్రీదేవి అతడిని గట్టిగా మందలించారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ప్రభాకర్, విచక్షణ కోల్పోయి ఇంట్లోని కత్తితో వారిద్దరినీ అతి కిరాతకంగా నరికి చంపాడు. రియాద్‌లోని తెలుగు సంఘం ప్రతినిధులు మృతదేహాలను రాజమండ్రికి పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు