Kamal Haris: కమలా హారిస్ ప్రచార కార్యాలయం పై కాల్పులు! కమలాహారిస్ పార్టీ సమన్వయ ప్రచార కార్యాలయం పై గుర్తు తెలియని వ్యక్తులు అర్థరాత్రి తుపాకులతో దాడులకు తెగబడ్డారు. అరిజోనాలోని డెమోక్రటిక్ పార్టీ సమన్వయ ప్రచార కార్యాలయం పై అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. By Bhavana 25 Sep 2024 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి America: మరో రెండు నెలల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థులుగా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లో బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గత కొంత కాలంగా అభ్యర్థులపై దాడులు సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా కమలాహారిస్ పార్టీ సమన్వయ ప్రచార కార్యాలయం పై గుర్తు తెలియని వ్యక్తులు అర్థరాత్రి తుపాకులతో దాడులకు తెగబడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అరిజోనాలోని డెమోక్రటిక్ పార్టీ సమన్వయ ప్రచార కార్యాలయం పై అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో కార్యాలయంలోని సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. కార్యాలయం కిటికీల వద్ద నుంచి కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. అర్థరాత్రి సమయంలో కార్యాలయంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికార వర్గాలు తెలిపాయి. కొద్ది రోజుల క్రితం మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై వరుస కాల్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఫోర్లిడాలోని వెస్ట్ పామ్ బీచ్ లో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా నిందితుడు హత్యాయత్నం చేశాడు. ఫెన్సింగ్ వద్ద నుంచి నిందితుడు తుపాకీతో దూసుకు రావడాన్ని గమనించి భద్రతా బలగాలు కాల్పులు జరిపి నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నాయి. రెండు నెలల క్రితం పెన్సిల్వేనియాలో ఎన్నికల సభలో ట్రంప్ ప్రసంగిస్తున్న సమయంలో కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో ట్రంప్ కుడి చెవి పై భాగం నుంచి తూటా దూసుకెళ్లింది. తాజాగా కమలా హారిస్ ప్రచార కార్యాలయం పై కాల్పులు జరగడం సంచలనం సృష్టిస్తుంది. మరో వైపు అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై ఆసియన్ అమెరికన్ ఓటర్ల లో 38 పాయింట్లతో ముందంజలో ఉన్నట్లు తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఆసియా అమెరికన్ ఓటర్లలో 66 శాతం మంది హారిస్ కు మద్దతుగా ఉండగా..కేవలం 28 శాతం మంది ట్రంప్ నకు మద్దతుగా నిలిచారు. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి