/rtv/media/media_files/kqRSCYltWyMkmg4BRcPN.jpg)
Space And Astronauts: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ కి ముగ్గురు కొత్త వ్యోమగాములు వచ్చారు. దీంతో భూమి చుట్టూ తిరుగుతున్న వ్యోమగాముల సంఖ్య ప్రస్తుతం 19కి చేరింది. స్పేస్ స్టేషన్ ప్రారంభించిన తర్వాత ఇప్పుడు కక్ష్యలో 19 మంది ఉన్నారు.. ఇది అంతరిక్షంలో మానవ ఉనికికి కొత్త రికార్డు అంటున్నారు నాసా అధికారులు. మానవ అన్వేషణ సరిహద్దుని విస్తరించినందుకు మేము గర్విస్తున్నామని నాసా తన ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
తాజాగా నాలుగు రోజుల క్రితం ముగ్గురు రష్యన్ సోయుజ్ క్యాప్సూల్‌లో ఐఎస్ఎస్‌కి వెళ్లారు. వీరిలో నాసా వ్యోమగామి డాన్ పెటిల్‌తో పాటు రోస్కోస్మోస్ వ్యోమగాములు అలెక్సీ ఓవ్చినిన్, ఇవాన్ వాగ్నర్ ఉన్నారు. వీరితో కలిపి అంతరిక్షంలో వ్యోమగామలు సంఖ్య 19కు చేరింది. గతేడాది 17 మంది సపేస్‌లో ఉంటే ఆ రికార్డ్‌లను అధిగమించారని. Space.com చెప్పింది. 2020 నుంచి అన్ని సమయాల్లో ఐఎస్ఎస్‌లో కనీసం ఒక వ్యక్తి ఉంటూ వస్తున్నారని తెలిపింది.
After Wednesday's launch to the @Space_Station, there are now 19 humans in orbit—a new record for humanity.
— NASA (@NASA) September 13, 2024
We're proud to help expand the boundaries of human exploration. Ad astra! pic.twitter.com/3FvzQlbmNN
ప్రస్తుతం అంతరిక్షంలో పెటిల్, ఓవ్చినిన్, వాగ్నెర్‌తో పాటు సునీతా విలియమ్స్, బారీ విల్మోర్, మైఖేల్ బారట్, ట్రేసీ కాల్డ్‌వెల్-డైసన్, మాథ్యూ డొమినిక్, జీనెట్ ఎప్స్, నికోలాయ్ చుబ్, ఒలేగ్ కొనోనెంకో, అలెగ్జాండర్ గ్రెబెంకిన్ ఉన్నారు. చైనా టియాంగాంగ్ అంతరిక్ష కేంద్రంలో ముగ్గురు వ్యక్తులు షెంజౌ 18 మిషన్‌కి చెందిన లి గ్వాంగ్సు, లి కాంగ్ మరియు యే గ్వాంగ్‌ఫు ఉన్నారు. వారితో పాటు మరో నలుగురు వ్యోమగాములు ఫ్రీ ఫ్లైయింగ్ క్రూ డ్రాగన్‌లో నివసిస్తున్నారు. వీరిలో జారెడ్ ఐజాక్‌మాన్, స్కాట్ పొటీట్, సారా గిల్లిస్ మరియు అన్నా మీనన్ ఉన్నారు.