Kristina Joksimovic : మోడల్‌ ని ముక్కలుగా నరికి చంపిన భర్త!

మాజీ మిస్ స్విట్జర్లాండ్ ఫైనలిస్ట్ అయిన క్రిస్టినా జోక్సిమోవిక్ ను ఆమె భర్త థామస్ చంపాడనే ఆరోపణలు వినిపించడంతో అతనిని అరెస్ట్‌ చేశారు. బాసెల్ సమీపంలోని బిన్నింగెన్‌లోని వారి ఇంటిలో ఆమెను భర్త ముక్కలు ముక్కలుగా నరికి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు.

author-image
By Bhavana
New Update
kristina

Kristina Joksimovic : మాజీ మోడల్‌ ని అత్యంత కిరాతకంగా ఆమె భర్తే నరికి చంపాడు. అతను సైకోలా మారి భార్యను గొంతు కోసి చంపడమే కాకుండా ముక్కలుముక్కలుగా నరికి మాంసంగా మార్చినట్లు తెలిసింది. నిజానికి ఈ ఘటన ఇప్పుడు జరగలేదు. కానీ ఈ కేసులో షాక్ ఇచ్చే పలు విషయాలు మాత్రం తాజాగా బయటకువచ్చినట్లు కోర్టు వెల్లడించింది. 

మాజీ మిస్ స్విట్జర్లాండ్ ఫైనలిస్ట్ అయిన క్రిస్టినా జోక్సిమోవిక్ ను ఆమె భర్త థామస్ చంపాడనే ఆరోపణలు వినిపించడంతో అతనిని అరెస్ట్‌ చేశారు. బాసెల్ సమీపంలోని బిన్నింగెన్‌లోని వారి ఇంటిలో ఆమెను భర్త అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఫిబ్రవరి 13న 38 ఏళ్ల మోడల్ మృతదేహం ఆమె ఇంట్లో ఉన్న లాండ్రీ ప్రాంతంలో లభ్యమైంది. స్థానిక సమాచారం ప్రకారం “థామస్”గా గుర్తించబడిన ఆమె 41 ఏళ్ల భర్త ను కొద్ది రోజుల తరువాత పోలీసులు ఆమె భర్తను అరెస్ట్‌ చేశారు.

అయితే అతను నేరాన్ని అంగీకరించాడు. కానీ భార్య కత్తితో దాడి చేయడంతో ఇది ఆత్మరక్షణ చర్య అని తెలిపాడు. తాజాగా ఈ కేసు విచారణకు రాగా లాసాన్‌లోని ఫెడరల్ కోర్టు బుధవారం తనను విడుదల చేయాలని అతను చేసిన అభ్యర్థనను కొట్టి పారేసింది. విచారణలో వెన్నులో వణుకు పుట్టించే విషయాలు బయట పడ్డాయి. జోక్సిమోవిక్ మరణానికి ముందు ఆమె గొంతు కోసి చంపినట్లు అధికారుల విచారణలో తెలిసింది.

తప్పును ఒప్పుకున్న ఆ సైకో తాను ఆత్మ రక్షణ కోసం ఆ పని చేశాను కాబట్టి తనను విడుదల గురించి కోర్టుకు మరోసారి రిక్వెస్ట్ చేశాడు. థామస్ విడుదల కోసం చేసిన అప్పీల్‌ను స్విట్జర్లాండ్‌లోని లౌసాన్‌లోని ఫెడరల్ కోర్టు అతను హత్య చేసినట్లు అంగీకరించిన తర్వాత తిరస్కరించింది. అంతేకాదు ఈ తీర్పు నేరానికి సంబంధించిన కొత్త వివరాలను బయటపెట్టింది. థామస్‌ కి మానసిక ఆరోగ్యం సరిగా లేదని, అందుకే ఇలా ప్రవర్తించినట్లు కోర్టు చెప్పింది.

పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం జాక్సా, కత్తి, గార్డెన్ షియర్‌లను ఉపయోగించి జోక్సిమోవిక్ శరీరాన్ని ముక్కలు చేశాడు. అంతకంటే ముందు ఆమెను ఈ సైకో గొంతు కోసి చంపినట్టు తేలింది. తోట కత్తెర వంటి వాటిని ఉపయోగించి లాండ్రీ గదిలో ఆమె శరీరాన్ని ముక్కలు చేశాడు. ఆమె అవశేషాలను తరువాత హ్యాండ్ బ్లెండర్‌తో ప్రాసెస్ చేసి, వాటిని రసాయన ద్రావణంలో కరిగించకముందే “ప్యూరీడ్” స్థితికి మార్చినట్లు స్థానిక మీడియా సంస్థ తెలిపింది.

కానీ ఆత్మరక్షణ కోసమే తన భార్యను చంపేశాని, ఆమె తనపై కత్తితో దాడి చేసిందని థామస్ కోర్టుకు తెలిపాడు. హత్య తర్వాత, అతను భయపడి ఆమె శరీరాన్ని ముక్కలు చేయాలని డిసైడ్ అయినట్టు చెప్పాడు. అయితే వైద్య, ఫోరెన్సిక్ సాక్ష్యాలు భిన్నంగా ఉన్నాయి. పోలీసు అధికారులు థామస్ క్రూరమైన ప్రవర్తనకు స్పష్టమైన సాక్ష్యాలను సమర్పించారు.

జోక్సిమోవిక్ మిస్ నార్త్‌వెస్ట్ స్విట్జర్లాండ్‌గా కిరీటాన్ని దక్కించుకుంది. 2007లో మిస్ స్విట్జర్లాండ్‌కు ఫైనలిస్ట్‌గా నిలిచింది. 2013లో మిస్ యూనివర్స్ పోటీకి మోడల్ డొమినిక్ రిండర్‌క్‌నెచ్ట్‌కు మార్గదర్శకత్వం చేస్తూ, క్యాట్‌వాక్ కోచ్‌గా తన సొంత వ్యాపారాన్ని స్థాపించింది. ఈ జంటకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Also Read: కేజ్రీవాల్‌ కి బెయిల్‌

Advertisment
Advertisment
తాజా కథనాలు