మెషీన్‌ లెర్నింగ్‌ ఆవిష్కరణలకు.. భౌతిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్

భౌతిక శాస్త్రంలో విశేష కృషి చేసినందుకు గాను ఈ ఏడాది ఇద్దరు వ్యక్తులకు నోబెల్ బహుమతి వరించింది. మెషీన్ లెర్నింగ్‌ ఆవిష్కరణలకు జాన్ జె.హోప్‌ఫీల్డ్‌, జెఫ్‌రీ ఈ.హింటన్‌లుకు ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ బహుమతి లభించింది.

nobel prices
New Update

భౌతిక శాస్త్రంలో కృషి చేసినందుకు ఇద్దరు వ్యక్తులకు ఈ ఏడాది నోబెల్ బహుమతి వరించింది. మెషిన్ లెర్నింగ్ ఆవిష్కరణలకి గాను జాన్ జె.హోప్‌ఫీల్డ్‌, జెఫ్‌రీ ఈ.హింటన్‌లుకు ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ బహుమతి లభించింది. భౌతిక శాస్త్రంలో గతేడాది ముగ్గురుని వరించిన నోబెల్ పురస్కారం ఈ ఏడాది ఇద్దరిని మాత్రమే వరించింది.

8.4 కోట్ల నగదు బహుమతి..

స్టాక్‌హోమ్‌లోని రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ భౌతిక శాస్త్రంలో నోబెల్‌ పురస్కారానికి 2024 సంవత్సరానికి ఎంపిక చేసింది. ప్రస్తుతం జియోఫ్రే హింటన్‌ కెనడాలోని టొరంటో యూనివర్సిటీలో, జాన్‌ హోప్‌ఫీల్డ్‌ అమెరికాలోని ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీలో ప్రొఫెసర్లుగా పని చేస్తున్నారు. నోబెల్‌ పురస్కారం కింద వీరికి రూ.8.4 కోట్ల నగదు బహుమతి అందనుంది. ఇప్పటి వరకు 117 సార్లు భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతులను ప్రకటించారు.

ఇది కూడా చూడండి:  'BIG ANNOUNCEMENT' అంటూ లోకేష్ ఆసక్తికర ట్వీట్!

మొదట వైద్య విభాగంతో మొదలైన నోబెల్ పురస్కారాలు అక్టోబర్ 14 వరకు కొనసాగనున్నాయి. ఇంకా రసాయనశాస్త్రం, సాహిత్యం, శాంతి, అర్థ శాస్త్రంలో నోబెల్ గ్రహీతల పేర్లను ఇంకా తెలియనున్నారు. వైద్యశాస్త్రంలో విశేష కృషి చేసిన విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రవ్‌కున్‌లకు గాను ఈ ఏడాది నోబెల్ పురస్కారం దక్కింది. మైక్రో ఆర్‌ఎన్‌ఏ, పోస్ట్‌ ట్రాన్‌స్క్రిప్షనల్ జీన్‌ రెగ్యులేషన్‌లో దాని పాత్రను కనిపిట్టినందుకు ఈ పురస్కారం వరించింది. 

ఇది కూడా చూడండి: లంకతో తలపడనున్న భారత్.. భారీ తేడాతో గెలిస్తేనే..

స్వీడన్‌కు చెందిన సైంటిస్ట్, ఇంజినీర్, వ్యాపారవేత్తగా పేరుపొందిన ఆల్‌ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా ఈ నోబెల్ బహుమతులను ప్రధానం చేస్తున్నారు. 1896లో ఆల్‌ఫ్రెడ్ నోబెల్ మరణించారు. 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్టులను ప్రతీ ఏడాది అందజేస్తున్నారు. అవార్డు గ్రహీతలకు 11 లక్షల స్వీడిష్ క్రోనర్ (10 లక్షల డాలర్ల) నగదు అందుతుంది. అంటే మన కరెన్సీలో రూ.8 కోట్ల 39 లక్షలు. వీటిని డిసెంబర్ 10న అవార్డు గ్రహీతలకు అందజేస్తారు. 

ఇది కూడా చూడండి: ఆర్టీవీ ఎఫెక్ట్..నకిలీ విదేశీ బ్యాంక్ గ్యారంటీలపై ఆర్బీఐ సర్క్యులర్

#nobel-prize
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe