అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం సాయంత్రం భారతీయ అమెరికన్లతో కలిసి వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. జో బైడెన్ భార్య అమెరికా ఫస్ట్ లేడీ జిల్ బైడెన్‌తో కలిసి వైట్ హౌస్‌లోని బ్లూ రూమ్‌లో దీపం వెలిగించి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఈ అధ్యక్ష ఎన్నికలకు అతను పోటీ చేయకపోవడంతో వైట్‌హౌస్‌లో ఇదే బైడెన్ చివరి దీపావళి.
ఇది కూడా చూడండి: ఆలయంలో పేలిన బాణాసంచా.. 150 మందికి పైగా గాయాలు
వైట్‌హౌస్‌లో ఇదే చివరి దీపావళి..
అమెరికాలో నివాసం ఉంటున్న ప్రముఖ ఇండియన్ అమెరికన్స్‌ను ఈ దీపావళి వేడుకలకు బైడెన్ పిలిచారు. బైడెన్ ప్రెసిడెంట్ పదవి చేపట్టనప్పటి నుంచి దీపావళి వేడుకలు జరుపకుంటున్నారు. ఈ వేడుకల కోసం బైడెన్ రిసెప్షన్ కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: ధంతేరాస్ స్పెషల్.. 10 నిమిషాల్లో బంగారం, వెండి డెలివరీ
2016లో వైట్‌హౌస్‌లో నిర్వహించిన మొదటి దీపావళి వేడుకలను బైడెన్ గుర్తు చేసుకున్నారు. దక్షిణాసియా అమెరికన్లతో పాటు వలసదారుల పట్ల ద్వేషం, శత్రుత్వం నుండి ఏర్పడిన చీకటి మేఘం 2024లో మళ్లీ కనిపించిందని బైడెన్ తెలిపారు.
ఇది కూడా చూడండి: వీధిన పడ్డ ఉద్యోగులు.. రెచ్చిపోయిన సోమిరెడ్డి..!
ఇది కూడా చూడండి: ఉచిత సిలిండర్ పథకం.. నేటి నుంచి బుకింగ్స్ స్టార్ట్