పేద ముస్లింలే టార్గెట్.. ఇజ్రాయెల్ మూర్ఖత్వం!

మొన్న పాలస్తీనా.. నిన్న లెబనాన్‌.. ఇవాళ యెమెన్‌లో జరిగింది ఇదే కదా! ఇంతకీ ముస్లిం దేశాలపై ఇజ్రాయెల్‌కు ఎందుకంత కక్ష? అటు ముస్లిం దేశమే అయినా సౌదీ అరేబియా మాత్రం ఇజ్రాయెల్‌కు ఎందుకు సపోర్టిస్తోంది? విశ్లేషణ ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.

New Update

కత్తుల పదునంతా తగ్గిపోయాక రాకెట్లు రుచి మరుగుతాయట..! ముస్లిం దేశాలపై ఇజ్రాయెల్‌ చేస్తున్న యుద్ధాన్ని చూస్తే ఈ విషయం నిజమే అనిపిస్తుంది. ముందుగా చిన్నాచితాక దాడులతో ప్రత్యర్థులను భయపెట్టే ఇజ్రాయెల్‌ ఆ తర్వాత టైమ్‌ చూసుకోని గగనతల దాడులతో రెచ్చిపోతుంటుంది. ఏ దేశాన్ని టార్గెట్‌ చేసినా ఇజ్రాయెల్‌ యుద్ధ వ్యూహం ఇదే! గగనతల దాడుల తర్వాత భూతల దాడులు చేయడం అమాయకుల ప్రాణాల్ని బలిగొనడం ఇజ్రాయెల్ నైజం. మిలిటెంట్లపై దాడుల సాకుతో సామాన్యులను కూడా పొట్టనబెట్టుకుంటుంది.

Israel


లెబనాన్‌-బీరూట్‌లోని ఒక భవనాన్ని ఇజ్రాయెల్ టార్గెట్‌ చేసింది. ఈ వైమానిక దాడిలో నలుగురు మరణించారు. తాజా వివాదం ముదిరిన తర్వాత బీరుట్‌లోని ఓ నివాస ప్రాంతంపై ఇజ్రాయెల్ దాడి చేయడం ఇదే తొలిసారి. అటు గత 24 గంటల్లో ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడుల్లో లెబనాన్‌లో కనీసం 105 మంది మరణించారని అసోసియేటెడ్ ప్రెస్ నివేదించింది. గత రెండు వారాల్లో లెబనాన్‌లో ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో 1,000 మందికి పైగా మరణించినట్లు అంతర్జాతీయ మీడియా నిర్ధారిస్తోంది. 

మొన్న పాలస్తీనా.. నిన్న లెబనాన్‌.. ఇవాళ యెమెన్‌లో జరిగింది ఇదే కదా! ఇంతకీ ముస్లిం దేశాలపై ఇజ్రాయెల్‌కు ఎందుకంత కక్ష?

లెబనాన్‌లోని హిజ్బుల్లా, యెమెన్‌లోని హౌతీలతో సహా ఇరాన్ మద్దతున్న మిలీషియాపై ఇజ్రాయెల్ దళాలు వైమానిక దాడులను తీవ్రతరం చేశాయి. నిజానికి హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతమైన తర్వాత హౌతీలు ఇజ్రాయెల్‌పై దాడులను పెంచారు. దీంతో ఇజ్రాయెల్ కౌంటర్ అటాక్‌కు దిగింది. వైమానిక దాడులతో యెమెన్‌పై విరుచుకుపడింది. మరోవైపు US దళాలు ఈశాన్య సిరియాలో తమ ప్రధాన మిత్రులైన కుర్దిష్ నేతృత్వంలోని సిరియన్ డెమోక్రటిక్ దళాలకు యుద్ధ సలహాలు ఇస్తున్నాయి. తాజాగా సిరియాపై అమెరికా బాంబులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 37 మంది ఇస్లామిక్ ఉగ్రవాదులు హతమయ్యారని అమెరికా చెబుతోంది.

hamas
నిజానికి అమెరికా అండతో ఇజ్రాయెల్‌ ముస్లిం దేశాలపై దాడులు చేయడం దశాబ్దాలుగా జరుగుతున్న ఉన్నది! 2006 ఇజ్రాయెల్‌-లెబనాన్‌ యుద్ధంలో సామాన్యులతో సహా సుమారు 1,200 మంది లెబనీస్‌ మరణించారు. 2024లో సెప్టెంబర్‌ 30వరకు ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో లెబనాన్‌ గడ్డపై 600 మందికిపైగా చనిపోయారు. అటు ఇజ్రాయెల్‌కు మరో సరిహద్దు ప్రాంతంలోనూ నిత్యం బెంజమిన్‌ బలగాలు దాడులు చేస్తుంటాయి. ఇది వందల సంఖ్యలో మరణాలకు దారితీసింది. ఇటు సిరియాలోని హిజ్బుల్లా స్థానాలను లక్ష్యంగా చేసుకుని నిత్యం ఇజ్రాయెల్‌ దళాలు రక్తపాతం సృష్టిస్తుంటాయి. ఇక పాలస్తీనా-గాజా గడ్డపై ఇజ్రాయెల్‌ జరిపే మారణహోమానికి హద్దే లేదు. అక్కడ వేల మంది పిల్లలని పిట్టల్లా కాల్చిపారేసింది ఇజ్రాయెల్ ఆర్మీ!

Israel war


అటు పాలస్తీనా, లెబనాన్‌, సిరియా మాత్రమే కాదు.. మరికొన్ని ముస్లిం దేశాలైన ఇరాన్, టర్కీ, ఈజిప్ట్, జోర్డాన్‌లతోనూ ఇజ్రాయెల్‌కు వైరం ఉంది. ఇలా పొద్దున లెగిస్తే ఏదో ఒక దేశంపై ఇజ్రాయెల్‌ దాడులు చేస్తూనే ఉంటుంది. దీనికి కొన్ని కారణాలు చెప్పుకుంటూ ఉంటుంది. హమాస్ , హిజ్బుల్లా లాంటి సంస్థల నేతలు ఉగ్రవాదులని ఇజ్రాయెల్‌-అమెరికా వర్గాలు చెబుతుంటాయి. అయితే పాలస్తీనా జాతి ప్రతిఘటనకు హమాస్‌ ప్రతిరూపమని ఇజ్రాయెల్‌ వ్యతిరేక దేశాలైన ఇరాన్‌ వాదిస్తుంటాయి. పాలస్తీనా భూభాగాలను అక్రమించుకోవడమే ఇజ్రాయెల్‌ లక్ష్యమని.. ఈ లక్ష్యానికి వ్యతిరేకంగా ఎవరూ వచ్చినా అమెరికా అండతో వారిపై బాంబుల వర్షం కురిపిస్తూ ఉండడం ఇజ్రాయెల్‌ నైజమన్న విమర్శలున్నాయి.

Muslim countries war

 

అన్ని దేశాలతోనూ వైరం..

దాదాపు అన్ని ముస్లిం దేశాలతోనూ ఇజ్రాయెల్‌కు వైరం ఉంది. అయితే సౌదీ అరేబియా మాత్రం ఇజ్రాయెల్‌కు అండగా నిలుస్తూ ఉంటుంది. అటు అమెరికాతోనూ సౌదీ ఫ్రెండ్లీ రిలేషన్‌ మెయింటెయిన్‌ చేస్తుంది. 2020లో ఇరాన్‌ మిలిటరీ ఆఫీసర్‌ ఖాసీం సులేమనీ హత్యకు గురైనప్పుడు సౌదీ అరేబియా ప్రభుత్వం సంబరాలు చేసుకుంది. ఇక పాలస్తీనా ముస్లింల కోసం తమ దేశంలో ఎవరూ కూడా ప్రార్థనలు చేయవద్దని సౌదీ అధికారిక ఆదేశాలు జారి చేసిందంటే అది ఇజ్రాయెల్‌కు ఎంత దగ్గరో అర్థం చేసుకోవచ్చు. ఇలా ముస్లిం దేశాలను కాకుండా ఇజ్రాయెల్‌ వైపు సౌదీ ఉండడం వెనుక ఓ మతపరమైన కారణం ఉందంటారు విశ్లేషకులు. సౌదీ అరేబియా సున్నీలు ఎక్కువగా ఉండే దేశం.. ఇరాన్‌ షియాలు ఎక్కువగా ఉండే దేశం. ఈ రెండు వర్గాల మధ్య తరతరాలుగా ఎడతెగని వైరం ఉందన్నది జగమెరిగిన సత్యం.

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe