Iran - israel war: యుద్ధంలో బిగ్ ట్విస్ట్.. ఇజ్రాయెల్ ఆర్మీ ఆధీనంలోకి లెబనాన్‌

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత ముదిరాయి. ఇటు ఇరాన్ దాడులు, అటు ఇజ్రాయెల్ భూతల దాడులతో ప్రాంతీయ ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. హిజ్బుల్లా స్థావరాలను టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ సైన్యం మంగళవారం ఉదయం దక్షిణ లెబనాన్‌లోకి ప్రవేశించింది.

New Update
BREAKING

BREAKING

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత ముదిరాయి. ఇటు ఇరాన్ దాడులు, అటు ఇజ్రాయెల్ భూతల దాడులతో ప్రాంతీయ ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. మరోవైపు, లెబనాన్ సరిహద్దుల్లో యుద్ధం కొత్త మలుపు తిరిగింది. హిజ్బుల్లా స్థావరాలను టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ సైన్యం మంగళవారం ఉదయం దక్షిణ లెబనాన్‌లోకి ప్రవేశించింది. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయం లక్ష్యంగా ఇరాన్ రెండు డ్రోన్లతో దాడికి పాల్పడింది. ఈ దాడి ధాటికి ఎంబసీ భవనంపై మంటలు చెలరేగి, దట్టమైన పొగ అలముకుంది.

సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం, ఈ దాడిలో ఎంబసీ భవనం కొంత మేర దెబ్బతిన్నప్పటికీ, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. "అమెరికా ఎంబసీపై దాడికి ప్రతీకారం ఎలా ఉంటుందో ఇరాన్ త్వరలోనే చూస్తుంది" అని ఆయన హెచ్చరించారు. రియాద్, జెడ్డా, ధహ్రాన్ వంటి ప్రాంతాల్లోని అమెరికన్ పౌరులు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని రాయబార కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. హిజ్బుల్లా స్థావరాలను ధ్వంసం చేసేందుకు, సరిహద్దు గ్రామాల నుండి ఇజ్రాయెల్‌పై దాడులు ఆపేందుకు 'సెక్యూరిటీ జోన్' ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఈ భూతల దాడి ప్రారంభమైంది.

ఇజ్రాయెల్ సైన్యం లోపలికి రావడంతో హిజ్బుల్లా ఉత్తర ఇజ్రాయెల్, గోలన్ హైట్స్ వైపు రాకెట్లు, డ్రోన్లతో విరుచుకుపడింది. గత శనివారం (ఫిబ్రవరి 28) ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన భారీ దాడుల్లో ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ మరణించినట్లు వార్తలు రావడంతో, ఇరాన్ తన 'యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్' (హిజ్బుల్లా, హౌతీ, మిలిషియా గ్రూపులు) ద్వారా గల్ఫ్ దేశాల్లోని అమెరికా ఆస్తులపై ప్రతీకార దాడులు చేస్తోంది.

 ప్రస్తుతం పశ్చిమాసియా అంతటా భయాందోళనలు నెలకొన్నాయి. కతర్, కువైట్, బహ్రెయిన్‌లోని అమెరికా స్థావరాలను కూడా ఇరాన్ లక్ష్యం చేసుకుంటోంది. ఐక్యరాజ్యసమితి, ఇతర ప్రపంచ దేశాలు ఈ యుద్ధం మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీయవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Advertisment
తాజా కథనాలు