/rtv/media/media_files/f4SWaVENFLtCaqQqAQcq.jpg)
Israel: ఇజ్రాయెల్ దాడుదలతో అస్తవ్యస్తమైన గాజాలో కల్లోల పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. వేలాది భవనాలు నేలలమట్టమవడంతో ఉండటానికి నిలువనీడ లేక ఎంతోమంది పాలస్తీనా వాసులు శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. గాజాలో పౌరుల దుస్థితి పై ఐక్యరాజ్య సమితితో పాటు ప్రపంచ వ్యాప్తంగా మానవహక్కుల సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Also Read: Mulugu: వాజేడు ఎస్సై ఆత్మహత్య కేసు...పోలీసుల అదుపులో యువతి!
ఈ పరిణామాల వేళ మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. గాజా ఇజ్రాయెల్ ప్రయోగిస్తున్న డ్రోన్ల నుంచి చిన్న పిల్లల ఏడుపు శబ్దాలు వినిపిస్తున్నాయట.పాలస్తీనీయులను బయటకు రప్పించి దాడులు చేయడం కోసమే ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారని యూరో -మిడ్ హ్యూమన్ రైట్స్ మానిటర్ మాహా హుస్సేని ఆరోపించారు.
Also Read: SCR: రైల్వే ప్రయాణికులకు తీపి కబురు.. ఇక నుంచి ఆ బాధపడనవసరం లేదు!
ఈ మేరకు ఆమె ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు వెల్లడించారు. ఇజ్రాయెల్ కు చెందిన క్వాడ్‌కాప్టర్ల డ్రోన్ల నుంచి వింత శబ్దాలు వినిపిస్తున్నాయని ఏప్రిల్ మధ్యలో మాకు సమాచారం అందింది.వాటిలో నుంచి చిన్న పిల్లల ఏడుపు శబ్దాలు,మహిళల ఆర్తనాదాల వంటివి వినిపిస్తున్నాయని కొంతమంది చెప్పారు.దీంతో నేను వ్యక్తిగతంగా నుసెరాయిత్ లో పర్యటించి చాలా మంది పాలస్తీనీయులతో వేర్వేరుగా మాట్లాడి దీని గురించి సాక్ష్యాధారాలతో తెలుసుకున్నా అంటూ మహా వెల్లడించారు.
Also Read: Pushpa 2: ‘పుష్ప’ కన్నడ వివాదం..అసలు కారణం ఇదేనా!
ఈ శబ్ధాలతో పాలస్తీనీయులను శిబిరాల నుంచి బయటకు రప్పించి వారి పై దాడులు చేసేందుకు ఇజ్రాయెల్ ఈ చర్యలకు పాల్పడుతోందని ఆమె అన్నారు.ఏడుపు శబ్ధాలు,అరుపులు విని సాయం చేసేందుకు వెళ్లిన చాలా మంది దాడుల్లో గాయపడ్డారని తెలిపారు. వెస్ట్ బ్యాంక్ లోని ఖాన్ యూనిస్ లోనూ ఈ తరహా ఘటనలు జరిగాయని సమాచారం.
Also Read: BIT Coin: 1,00,000 డాలర్లకు బిట్ కాయిన్ !
నాకు అమ్మ కావాలని చిన్నారుల ఏడుపు శబ్ధాలతో డ్రోన్లను ప్రయోగించి దాడులు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.గతేడాది అక్టోబర్ 7 తర్వాత గాజాపై దాడులు మొదలు పెట్టిన నాటినుంచి ఇజ్రాయెల్ ఈ రిమోట్ కంట్రోల్ ఆధారిత క్వాడ్ కాప్టర్లను విరివిగా ఉపయోగిస్తోంది. నిఘా పెట్టడం ,మూకను చెదరగొట్టడం వంటివి ఈ డ్రోన్లతో చేస్తున్నారు.
ఈ ఏడాది జనవరిలో గాజాలో ఆహారం కోసం ఎగబడిన వందలమంది పౌరులపైనా ఈ డ్రోన్లతోనే కాల్పులు జరిపినట్లు అప్పట్లో కథనాలు వచ్చాయి. తాజాగా వీటికి సౌండ్ వ్యవస్థను అమర్చినట్లు సమాచారం. హిబ్రూ, అరబిక్ భాషల్లో ఈ శబ్దాలు వస్తున్నాయట.