యుద్ధంలో ఇజ్రాయెల్ అద్భుతం.. ప్రపంచంలో మొదటి సారి లేజర్ సిస్టమ్

వార్ స్ట్రాటజీస్‌లో ఇజ్రాయెల్ రికార్డ్ సృష్టించింది. 2026 ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో భాగంగా, ప్రపంచంలోనే మొట్టమొదటి హై-ఎనర్జీ లేజర్ రక్షణ వ్యవస్థ ఐరన్ బీమ్‌ను ఇజ్రాయెల్ రక్షణ దళాలు విజయవంతంగా రంగంలోకి దించాయి.

New Update
_Iron Beam

వార్ స్ట్రాటజీస్‌లో ఇజ్రాయెల్ రికార్డ్ సృష్టించింది. 2026 ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో భాగంగా, ప్రపంచంలోనే మొట్టమొదటి హై-ఎనర్జీ లేజర్ రక్షణ వ్యవస్థ ఐరన్ బీమ్‌ను ఇజ్రాయెల్ రక్షణ దళాలు విజయవంతంగా రంగంలోకి దించాయి. మార్చి 2న హిజ్బుల్లా ప్రయోగించిన రాకెట్లను ఈ లేజర్ వ్యవస్థ గాలిలోనే పేల్చి వేసి దీని శక్తి సామర్థ్యాలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి.

ఏమిటీ ఐరన్ బీమ్?

రాఫెల్ అడ్వాన్స్‌డ్ డిఫెన్స్ సిస్టమ్స్ అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థను హిబ్రూలో 'ఓర్ ఈటన్' అని పిలుస్తారు. ఇది 100-కిలోవాట్ సామర్థ్యం గల లేజర్ కిరణాలను ప్రయోగించి శత్రువుల రాకెట్లు, డ్రోన్లు, మోర్టార్లు, ఫిరంగి గుండ్లను క్షణాల్లో ధ్వంసం చేస్తుంది. ఇజ్రాయెల్ రక్షణ కవచంలో ఉన్న ఐరన్ డోమ్, డేవిడ్స్ స్లింగ్ వంటి వ్యవస్థలకు ఇది అదనపు బలాన్ని ఇస్తుంది. ఐరన్ బీమ్ 'ఫైబర్ లేజర్' టెక్నాలజీపై పనిచేస్తుంది. దీని పనితీరు 3 దశల్లో ఉంటుంది.

గుర్తింపు: రాడార్ వ్యవస్థలు శత్రు ముప్పును గుర్తించి ట్రాక్ చేస్తాయి.
ప్రయోగం: లక్ష్యం ఖరారైన వెంటనే, సెకనుకు 30,000 కిలోమీటర్ల వేగంతో లేజర్ పవర్ విడుదలవుతుంది.
విధ్వంసం: ఈ కిరణాలు లక్ష్యంపై తీవ్రమైన వేడిని పుట్టిస్తాయి. దీనివల్ల రాకెట్ లేదా డ్రోన్ వెలుపలి భాగం కరిగిపోయి గాలిలోనే పేలిపోతుంది.

ఖర్చు తక్కువ.. ఫలితం ఎక్కువ!

ఐరన్ బీమ్ అతిపెద్ద ప్రయోజనం దాని తక్కువ వ్యయం. ఐరన్ డోమ్ వంటి వ్యవస్థల్లో ఒక్కో క్షిపణిని అడ్డుకోవడానికి వేల డాలర్లు ఖర్చవుతాయి. కానీ, ఐరన్ బీమ్ ద్వారా ఒక్క షాట్ కాల్చడానికి కేవలం $2 నుండి $10 (సుమారు ₹170 - ₹850) మాత్రమే ఖర్చవుతుంది. ఇది విద్యుత్తుతో పనిచేస్తుంది కాబట్టి, దీనికి 'అపరిమిత మందుగుండు' సౌకర్యం ఉంటుంది.

ఆపరేషన్ 'రోరింగ్ లయన్'లో కీలక పాత్ర

2014లో ప్రారంభమైన ఈ పరిశోధన, పదేళ్ల తర్వాత సెప్టెంబర్ 2025లో పూర్తిస్థాయి కార్యాచరణకు సిద్ధమైంది. ప్రస్తుతం ఇరాన్ అనుకూల గ్రూపులతో జరుగుతున్న 'ఆపరేషన్ రోరింగ్ లయన్'లో భాగంగా ఇజ్రాయెల్ దీనిని పెద్ద ఎత్తున వాడుతోంది. 10 కిలోమీటర్ల పరిధిలో ఇది అజేయంగా పనిచేస్తోంది. వర్షం లేదా దట్టమైన మేఘాలు ఉన్నప్పుడు దీని సామర్థ్యం కొంత తగ్గినప్పటికీ, డ్రోన్ దాడులను అడ్డుకోవడంలో ఇది గేమ్ ఛేంజర్‌గా మారింది. మొత్తానికి, ఖరీదైన క్షిపణుల అవసరం లేకుండా కేవలం 'కాంతి'తో యుద్ధాన్ని ఎదుర్కోవడం రక్షణ రంగంలో ఒక మైలురాయిగా నిలిచిపోనుంది.

Advertisment
తాజా కథనాలు