Israel-Iran: జర్నలిస్టులను చంపేస్తున్నారు.. సామాన్యులపై బాంబులు వేస్తున్నారు.. పసిపిల్లలను కూడా వదలడం లేదు.. ఇజ్రాయెల్ సైన్యం క్రూరత్వానికి హద్దే లేకుండా పోతోంది.. గాజాతో పాటు లెబనాన్ గడ్డపై రక్తపాతాన్ని సృష్టిస్తోంది. ఓ రోజు గాజాపై దాడులు చేస్తే మరో రోజు లెబనాన్ నేలపై నెత్తుటి దాహాన్ని తీర్చుకుంటుంది. అందుకే ఇప్పుడు ఇరాన్ రంగంలోకి దిగుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇజ్రాయెల్‌పై యుద్ధానికి సిద్ధంగా ఉండాలని ఆ దేశ పెద్దలు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని ప్రముఖ వార్తా సంస్థ న్యూ యార్క్ టైమ్స్ నివేదించింది.
Also Read: జగన్ బెయిల్ రద్దు..? అన్నాచెల్లెలి ఆస్తుల వివాదంలో టర్నింగ్ పాయింట్!
దక్షిణ లెబనాన్‌లోని హస్‌బాయాపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో తమ కెమెరామెన్ చనిపోయారని ఇరాన్ అనుకూల బ్రాడ్‌కాస్టర్ అల్-మయాదీన్ రిపోర్ట్ చేసింది. మరో ఇద్దరు జర్నలిస్టులు మరణించారని లెబనాన్ రాష్ట్ర వార్తా సంస్థ చెబుతోంది. అక్టోబర్ 7, 2023 తర్వాత గాజా గడ్డపై 140 మంది జర్నలిస్టులు ఇజ్రాయెల్ దాడుల్లో మరణించారు. అనేకమంది గాయపడ్డారు. మరి కొంతమంది కనిపించకుండా పోయారు.
Also Read: ఇరాన్ సైనిక బలగాలపై ఇజ్రాయెల్ దాడులు!
ప్రపంచ దేశాలను...
మరోవైపు నవంబర్ 5లోపే దాడి చేసేందుకు ఇజ్రాయెల్ సిద్ధమవుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అటాక్ చేయడం స్టార్ట్ చేస్తే ప్రపంచానికి మన పవర్ ఏంటో అప్పుడు తెలుస్తుందంటూ ఇజ్రాయెల్ రక్షణ మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు.. ప్రపంచ దేశాలను భయపెడుతున్నాయి. అయితే అదే లెవల్‌లో కౌంటర్ ఇచ్చేందుకు ఇరాన్ కూడా సిద్దంగా ఉంది.
Also Read: ప్రైవేట్ స్కూళ్లో గ్యాస్ లీకేజీ...30 మంది విద్యార్థులు..!
ఇంతకీ ఇజ్రాయెల్ ఏం ప్లాన్ చేస్తోంది? ఇరాన్ మీద ఎలాంటి టార్గెట్లు ఫిక్స్ చేసింది? పశ్చిమాసియాలో రక్తపాతం తప్పదా? ఇరాన్ తో కంపేర్ చేస్తే సైనికుల విషయంలో ఇజ్రాయెల్ సూపర్ స్ట్రాంగ్‌గా ఉంది. జనాభా పరంగా చిన్న దేశమైనా సైన్యం పరంగా చాలా ఎత్తులో ఉంది. రక్షణ రంగానికి భారీ బడ్జెట్ కేటాయింపులు, అడ్వాన్స్‌డ్ రిజర్వ్ ఫోర్స్‌లు, మొసాద్ లాంటి నిఘా వ్యవస్థ, పైగా అమెరికా లాంటి మిత్ర దేశాల సపోర్ట్.. అన్నీ కలిసి ఇజ్రాయెల్ సైన్యాన్ని మరింత బలంగా మార్చాయి. అయితే ఇరాన్ వైపు చైనా, రష్యా మద్దతుగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు బిగ్ రిలీఫ్.. తప్పిన పదవి గండం!
నిజానికి మిడిల్ ఈస్ట్‌లో అమెరికా, ఇజ్రాయెల్ ప్రయోజనాలకు సవాల్ విసురుతూ ఇరాన్ తన మిత్రులు, మిలీషియా దళాలతో ఓ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసింది. వీటన్నింటికీ వివిధ స్థాయిల్లో ఇరాన్ మద్దతు ఇస్తుంటుంది. ఇరాన్ మద్దతు ఉన్న అత్యంత శక్తిమంతమైన సాయుధ గ్రూపుల్లో లెబనాన్‌లోని హిజ్బొల్లా గ్రూపు ఒకటి. ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధం మొదలైనప్పటి నుంచి, సరిహద్దుల వద్ద ఇజ్రాయెల్, హిజ్బొల్లా గ్రూపుల మధ్య కూడా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఈ దాడుల్లో హిజ్బుల్లా కీలక నేతలు చనిపోతూనే ఉన్నారు. అయినా కూడా హిజ్బుల్లా వెనక్కి తగ్గడం లేదు. అటు ఇజ్రాయెల్ కూడా బలహీనులపై ప్రతాపం చూపడం ఆపడంలేదు.
ఇక హమాస్ సహా పాలస్తీనాలోని అనేక సాయుధ గ్రూపులకు ఇరాన్ ఆయుధాలతో పాటు శిక్షణ కూడా ఇస్తోంది. ఇది గాజా యుద్ధం సహా, ఇరాన్, దాని మద్దతు కలిగిన గ్రూపులుకు, ఇజ్రాయెల్ సహా దాని మిత్ర రాజ్యాల మధ్య ఘర్షణలకు కారణమవుతోంది. అటు ఇరాక్, సిరియా, జోర్డాన్‌లోని అమెరికా స్థావరాలపై దాడులు చేసిన ఇరాక్‌లోని షియా మిలీషియా గ్రూపులకు ఇరాన్ వెన్నుదన్నుగా ఉంటుంది. ఇది కూడా ఇజ్రాయెల్‌కు నచ్చదు. ఇలా దాదాపు ప్రతీ అంశంలోనూ ఇరాన్‌ది ఇజ్రాయెల్ వ్యతిరేక వైఖరే.. అందుకే ఏ క్షణంలోనైనా యుద్ధం మొదలయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి.