/rtv/media/media_files/2026/03/03/us-suicide-bombers-2026-03-03-19-07-29.jpg)
US SUICIDE BOMBERS
US SUICIDE BOMBERS : ఇరాన్ మీద మొండి ధైర్యంతో దాడులు చేస్తున్న అమెరికా పైకి గంభీరంగా కనిపిస్తున్నప్పటికీ లోపల మాత్రం భయం వెంటాడుతోందట. ఇరాన్ అంతలా బయపెడుతున్నది ఏంటంటే ఆత్మహుతి దాడులు. అవును ఇరాన్ అమెరికాపై ఆత్మహుతి దాడులకు తెగబడే అవకాశం ఉందని అమెరికా బయపడుతుంది. గల్ఫ్‌లోని US సైనిక స్థావరాలు, పౌరులే టార్గెట్‌గా. ఇరాన్ ఆత్మా*హుతి దాడులు చేసే అవకాశం ఉందని అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తోంది.
అమెరికా సైనికుల మీద ఆత్మహుతి దాడులు చేయడం కోసం తన ప్రాక్సీ గ్రూపులు హౌతీ,హమాస్,హెజ్‌బొల్లాలను.. ఉసిగొల్పే ఛాన్స్ ఉందని అమెరికా నిఘా వర్గాల హెచ్చరించాయి.ఇప్పటికే ఇరాన్ దళాలు రియాద్‌లో US ఎంబసీపై డ్రోన్ దాడి చేశాయి.
ఈ దాడుల తర్వాత మానవ బాంబుల రూపంలో దాడులు ఉండొచ్చనే అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. మిడిల్ ఈస్ట్ దేశాలైన కువైట్, బహ్రెయిన్, ఖతార్, సౌదీలోని అమెరికా బేస్‌లతో పాటు..యూదుల ప్రార్థనా స్థలాలపై సూసైడ్ అటాక్స్ జరిగే ఛాన్స్ ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. కాగా ఇరాన్ దాడుల్లో ఇప్పటికే ఆరుగురు అమెరికా సైనికుల మృతి చెందటంతో అమెరికా అలర్ట్ అయింది. ఆత్మహుతి దాడులను ఎదుర్కొనడానికి అమెరికా అన్ని రకాలుగా సన్నద్ధమవుతోంది.
Follow Us