/rtv/media/media_files/2026/02/17/india-1-2026-02-17-11-22-25.jpg)
అమెరికాలో నివసిస్తున్న ఓ భారతీయ జాతీయుడు అత్యంత దారుణమైన నేరానికి పాల్పడి పోలీసులకు చిక్కాడు. చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ఒదెల యశస్వి కొత్తపల్లి అనే యువకుడిని యూఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) అధికారులు అధికారికంగా వెల్లడించారు.
Telugu guy in U.S. prison under serious charges.
— M9 USA🇺🇸 (@M9USA_) February 17, 2026
Parents must be heartbroken. SAD!!! https://t.co/AxIvzJeXYB
నిందితుడు యశస్విని న్యూజెర్సీ రాష్ట్రంలో అదుపులోకి తీసుకున్నారు. 13 ఏళ్ల లోపు వయసున్న చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడినట్లు ఇతడిపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. కేవలం లైంగిక వేధింపులే కాకుండా, దొంగతనాలు చేయడం, బహిరంగ ప్రదేశాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం వంటి ఇతర నేరాలతో కూడా ఇతడికి సంబంధం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
షాకింగ్ విషయం వెలుగులోకి
అరెస్టయిన తర్వాత ఇతడి నేపథ్యం గురించి ఆరా తీయగా ఒక షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. యశస్వి సరైన వీసా లేదా అధికారిక పత్రాలు లేకుండానే అక్రమ మార్గంలో అమెరికాలోకి ప్రవేశించినట్లు ఇమ్మిగ్రేషన్ అధికారులు ధృవీకరించారు. దీనిపై ఇమ్మిగ్రేషన్ విభాగం సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే, ఈ కేసు ఎప్పుడు నమోదైంది లేదా నిందితుడిని ఖచ్చితంగా ఏ రోజు అరెస్ట్ చేశారనే వివరాలను మాత్రం ఇంకా గోప్యంగా ఉంచారు.
ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది. ఒకవైపు నేరాలకు సంబంధించి విచారణ జరుగుతుండగానే, మరోవైపు నిందితుడిని అమెరికా నుండి వెనక్కి పంపేందుకు ఇమ్మిగ్రేషన్ అధికారులు చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. ఈ కేసులో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా సరైన పత్రాలు లేకుండా అమెరికాలోకి ప్రవేశించారన్న కారణంతో గతేడాది పెద్దసంఖ్యలో భారతీయులను అగ్రరాజ్యం నుంచి వెనక్కి పంపించిన సంగతి తెలిసిందే. దాదాపు 3,800 మంది భారత పౌరులను అమెరికా స్వదేశానికి తిప్పిపంపింది.
Follow Us