Russia: 9/11 దాడులు లాగానే...విరుచుకుపడ్డ ఉక్రెయిన్‌!

రష్యాలోని కజాన్ నగరంలో 6 భవనాలపై ఉక్రెయిన్‌ డ్రోన్ దాడి జరిగింది. శనివారం ఉదయం, ఉక్రెయిన్ నుండి వచ్చే అనుమానిత డ్రోన్లు రష్యా కజాన్ నగరంలోని భారీ అంతస్తుల నివాస భవనాలను లక్ష్యంగా చేసుకుని ఈ డ్రోన్లు దాడులు చేశాయి.

New Update
rr

Russia: రష్యా-ఉక్రెయిన్‌ మధ్య చాలా కాలం నుంచి దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా రష్యాలోని కజాన్ నగరంలో 6 భవనాలపై ఉక్రెయిన్‌ డ్రోన్ దాడి జరిగింది. శనివారం ఉదయం, ఉక్రెయిన్ నుండి వచ్చే అనుమానిత డ్రోన్లు రష్యా కజాన్ నగరంలోని భారీ అంతస్తుల నివాస భవనాలను లక్ష్యంగా చేసుకుని  ఈ డ్రోన్లు దాడులు చేశాయి. రష్యాలోని కజాన్ నగరంలో కనీసం 6 భవనాలపై డ్రోన్లు దాడులు నిర్వహించాయి. 

ప్రస్తుతం ఈ ఘటనలకు సంబంధించి అనేక ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం, డ్రోన్‌లు భవనాలను ఢీకొన్నాయి. ఆపై పెద్ద పేలుడు శబ్దాలు వినిపించాయి. ఈ దాడిని 9/11 లాంటి దాడిగా అభివర్ణిస్తున్నారు. నిజానికి, అమెరికాలో 9/11 దాడి చాలా పెద్దది. 

విమానాలు భవనాలను ఢీ కొనగా.. ఆ దాడిలో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. అయితే రష్యాలో జరిగిన దాడుల్లో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం అయితే లేదు. ఉక్రెయిన్ ఈ దాడికి పాల్పడినట్లు రష్యా మీడియా పేర్కొంది. అయితే, ఉక్రెయిన్ ఈ దాడికి బాధ్యత వహించలేదు. రష్యాలోని కజాన్ నగరం సురక్షితమైన, ప్రశాంతమైన నగరాలలో ఒకటి. కజాన్‌లో విమాన రాకపోకలు ప్రస్తుతానికి నిలిపివేయబడ్డాయి. 

ప్రపంచంలోని అగ్రరాజ్యాలలో రష్యా ఒకటి. రష్యా ఈ విషయంపై సిరీస్ గా స్పందిస్తే యుద్ధ పరిస్థితులు మరింత తీవ్రంగా మారవచ్చు. గతంలో రష్యాలోని రిల్స్క్‌లో ఉక్రెయిన్ క్షిపణి దాడిలో చిన్నారి సహా ఆరుగురు మరణించారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు