/rtv/media/media_files/2026/03/03/fotojet-4-2026-03-03-16-47-59.jpg)
TEHRAN PRESIDENT OFFICE
TEHRAN PRESIDENT OFFICE : ఇరాన్ సుప్రీం మరణించినప్పటికీ ఏ మాత్రం వెనక్కు తగ్గకుండా ఒంటరిగా పోరాడుతూనే ఉంది. దీంతో ఇరాన్‌కు గట్టి బుద్ధి చెప్పాలని ఇజ్రాయెల్ మరింత రెచ్చిపోతుంది. ఈ రోజు ఇజ్రాయెల్ టెహ్రాన్‌పై బాంబులతో విరుచుకుపడింది. ఏకంగా ఇరాన్ అధ్యక్ష భవనంపై అటాక్ చేయడంతో పాటు టెహ్రాన్‌లోని ప్రధాన భవనాలపై బాంబుల వర్షం కురిపించింది. ఈ సందర్భంగా టెహ్రాన్ కీలక ప్రాంతాలను నేలమట్టం చేశామని IDF ప్రకటించింది. అంతేకాక పార్లమెంట్ సహా ప్రధాన కార్యాలయాలే టార్గెట్‌గా ఇజ్రాయెల్ దాడులకు పాల్పడతుండటంతో ఇరాన్ అట్టుడుకుతుంది.
అదే సమయంలో ఇరాన్ సహా ఆ దేశ మద్దతుదారులపై కూడా ఇజ్రాయెల్ మెరుపు దాడులు చేస్తుంది.తాజాగా లెబనాన్ రాజధాని బీరూట్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడింది.హెజ్‌బొల్లా ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్స్, ఆయుధ కర్మగారం, శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్‌పై ఇజ్రాయెల్ ఎయిర్‌ఫోర్స్ అటాక్ చేసింది.ఇందుకు సంబంధించి విజువల్స్ ను ఇజ్రాయెల్ విడుదల చేసింది. కాగా హెజ్బుల్లా పౌరులు నివసించే ప్రాంతాలను ఇరాన్ రక్షణగా వాడుకుంటోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తుంది. అంతేకాక ఇజ్రాయెల్‌పై దాడులు చేసే ఏ ఒక్కరినీ వదిలిపెట్టమని ఇజ్రాయెల్ హెచ్చరించింది.హెజ్‌బొల్లాకు చెందిన 160కిపైగా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడి చేసినట్లు వెల్లడించింది.
Follow Us