బ్యాలెట్ డ్రాప్ బాక్స్‌లకు నిప్పు.. మూడు దగ్ధం

అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో కొందరు దుండగులు బ్యాలెట్ డ్రాప్ బాక్స్‌లకు మంటలు అంటించగా.. మూడు బాక్స్‌లు ధ్వంసమయ్యాయి. నవంబర్ 5న జరగనున్న ఎన్నికల్లో రిపబ్లికన్‌ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్‌ అభ్యర్థిగా కమలాహారిస్‌ పోటీ చేస్తున్నారు.

drop box
New Update

నవంబర్ 5వ తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్‌ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్‌ అభ్యర్థిగా కమలాహారిస్‌ పోటీ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో కొందరు గుర్తు తెలియని దుండగులు వాషింగ్టన్, ఒరెగాన్‌లోని బ్యాలెట్ బాక్సులకు నిప్పు అంటించారు. దీంతో వేర్వేరు ప్రాంతాల్లో మూడు బ్యాలెట్ బాక్సులు దెబ్బతిన్నాయి. 

ఇది కూడా చూడండి: ధంతేరాస్ స్పెషల్.. 10 నిమిషాల్లో బంగారం, వెండి డెలివరీ

స్థానిక సెక్యూరిటీ గార్డులు మంటలు ఆర్పడంతో..

సౌత్ ఈస్ట్ మోరిసన్ స్ట్రీట్‌లో ఉన్న 1000 బాక్స్‌లు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. స్థానికంగా ఉన్న సెక్యూరిటీ గార్డులు మంటలు ఆర్పివేశారు. అయిన కూడా బ్యాలెట్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఇది కూడా చూడండి: వీధిన పడ్డ ఉద్యోగులు.. రెచ్చిపోయిన సోమిరెడ్డి..!

గుర్తు తెలియని దుండగులు కావాలనే ఈ బ్యాలెట్ బాక్స్‌లకు మంట అంటించినట్లుగా పోలీసులు గుర్తించారు. బ్యాలెట్ బాక్సుల కింద మండే స్వభావం ఉన్న పదార్థాలను అమర్చడం వల్ల ప్రమదం సంభవించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఇది కూడా చూడండి:  ఉచిత సిలిండర్ పథకం.. నేటి నుంచి బుకింగ్స్ స్టార్ట్

ఓరెగాన్‌లో సోమవారం తెల్లవారు జామున 3:30 ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ బ్యాలెట్ బాక్స్‌లను సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలని భావిస్తోంది. లైబ్రరీలు, కమ్యూనిటీ సెంటర్లలో ఉంచాలని స్థానిక ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. మళ్లీ ఇదే ఘటన రిపీట్ అవుతుందా? లేకపోతే బ్యాలెట్ బాక్స్‌లను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారో లేదో మరి చూడాలి. 

ఇది కూడా చూడండి: ఆలయంలో పేలిన బాణాసంచా.. 150 మందికి పైగా గాయాలు

#america
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe