Migrant Board: పడవలో 30 మృతదేహాలు!

సెనెగల్‌ తీరంలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. దేశ రాజధాని డాకర్‌ తీరానికి 38 నాటికల్‌ మైళ్ల దూరంలో సముద్రంలో కొట్టుకుపోతున్న ఓ పడవలో 30 మృతదేహాలను అధికారులు గుర్తించారు. మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో వారు ఎవరు అనేది గుర్తించడం కష్టంగా మారింది.

author-image
By Bhavana
migrant
New Update

Migrant Boat: పశ్చిమాఫ్రికా దేశమైన సెనెగల్‌ తీరంలో తీవ్ర విషాదం వెలుగులోకి వచ్చింది. దేశ రాజధాని డాకర్‌ తీరానికి 38 నాటికల్‌ మైళ్ల దూరంలో సముద్రంలో కొట్టుకుపోతున్న ఓ పడవలో 30 మృతదేహాలను అధికారులు గుర్తించారు. ముందు నౌకాదళానికి ఈ పడవ గురించి కొందరు గుర్తు తెలియని వారు సమాచారం అందించారు.

ఈ క్రమంలోనే ఓ పెట్రోలింగ్‌ బోట్‌ ను పంపగా..ఈ విషాదం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం గురించి సెనెగల్‌ మిలిటరీ ప్రతినిధి ఇబ్రహీమా సౌ ఒక ప్రకటనలో ప్రకటించారు. పడవను స్వాధీనం చేసుకున్న తరువాత అందులో 30 మంది మృతదేహాలు గుర్తించామని..అవి కుళ్లిపోయి స్థితిలో ఉండటంతో వారు ఎవరు అనేది గుర్తించడం కష్టంగా మారిందని తెలిపారు.

అసలు ఆ పడవ ఎక్కడి నుంచి వచ్చిందో కనిపెట్టడంతో పాటు మృతుల సంఖ్యను నిర్థారించే దిశగా విచారణను ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల ప్రారంభంలోనూ సెనెగల్‌ తీరంలో ఓ వలసదారుల పడవ నీట మునిగి సుమారు 37మంది మృతి చెందారు.

ఘర్షణలు, పేదరికం, ఉద్యోగాల కొరత వంటి కారణాలతో పశ్చిమ ఆఫ్రికా నుంచి అనేక మంది వలసదారులు సెనెగల్‌ ద్వారా విదేశాలకు అక్రమంగా వలస పోతుంటారు. చాలా మంది సమీపంలోని స్పెయిన్‌ కు చెందిన కానరీ దీవులకు వెళ్తుంటారు. స్పెయిన్‌ అధికారుల వివరాల ప్రకారం..ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 22, 300 మందికి పైగా వలసదారుల కానరీ దీవుల్లో అడుగు పెట్టారు. 

గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 126 శాతం ఎక్కువ అవ్వడం గమనార్హం.

 

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe