Women's Day 2024 : విమెన్స్‌ డే విషెస్‌ చెప్పడంతో ఒరిగేదేంటి..? మారాల్సింది వారి బుద్ధి కదా!

పురాణాల్లో ఎక్కడ ఆడవారిని పూజిస్తే అక్కడ సకల దేవతలు కొలువై ఉంటారని ఉంది. కానీ నేటి రోజుల్లో పూజలు మాట దేవుడెరుగు.. పూచిక పుల్లలు కంటే దారుణంగా తీసి పారేస్తూ సంవత్సరంలో ఒక రోజు మాత్రం మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపేస్తున్నారు.

Women's Day 2024 : విమెన్స్‌ డే విషెస్‌ చెప్పడంతో ఒరిగేదేంటి..? మారాల్సింది వారి బుద్ధి కదా!
New Update

Women's Day Wishes : మహిళా దినోత్సవం(Women's Day Wishes) పేరిట వేడుకలు చేయడానికి ప్రారంభమైన వారందరికీ దేశంలో ఆడవారి మీద జరుగుతున్న దారుణాలు, అన్యాయాలు కనిపించడం లేదో.. లేక వారు కళ్లకు గంతలు కట్టుకున్నారో తెలియదు కానీ... వేడుకలు చేసేశామా ఓ పది మంది ఆడవారి గురించి మంచిగా మాట్లాడేశామా అనే తీరులోనే చాలా మంది ఉంటున్నారు.

హడావుడి కాదు కావాల్సింది.. పరిష్కరం:

రాష్ట్రం(State) లోనో, దేశం(Country) లోనో ఏదో పెద్ద ఇన్సిడెంట్‌ జరిగితే కానీ కొవ్వొత్తులు పట్టుకుని రోడ్డెక్కని ప్రబుద్దులు చాలా మందినే ఉన్నారు. ఆ రెండు రోజులు మరి టీవీల్లో వస్తామానో..లేక మీడియాలో కనబడతామానో చాలా హడావిడి చేసేస్తుంటారు. మా అక్కలు, చెల్లెలు అనే వారు చాలా మంది ఉండనే ఉన్నారు. కానీ దేశంలో నిత్యం ఏదోక మూల స్త్రీల మీద ఆకృత్యాలు జరుగుతూనే ఉంటున్నాయి.వాటి అన్నిటి గురించి వీరికి తెలియక మౌనంగా ఉంటున్నారా అంటే మాత్రం సమాధానం ఉండదు.

క్షేమంగా ఇంటికి వస్తే చాలు:

ఎంతమంది ఎన్ని విధాలుగా మహిళల మీద జరుగుతున్న అన్యాయాల గురించి ప్రశ్నిస్తున్నప్పటికీ జరగాల్సిన ఘోరాలు జరుగుతూనే ఉంటున్నాయి. అసలు మహిళా దినోత్సవం పేరిట చేసే ఉత్సవాలతో మహిళలు నిజంగానే ఆనందపడిపోతున్నారా.. వీటి కోసమేనా వారు ఎదురు చూసేది. అసలు కానే కాదు... తాము ఇంటి నుంచి బయటకు వెళ్లి మళ్లీ క్షేమంగా ఇంటికి వస్తే చాలు అనుకునే రోజులు ప్రస్తుతం నడుస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా ఆడది అయితే చాలు అన్నట్లు ప్రవర్తిస్తున్నాయి కొన్ని మృగాలు. కేవలం పట్టణాల్లోనే ఇలా జరుగుతుందనుకుంటే చాలా పొరపాటు.. పల్లెటూర్లలో కూడా బయటకు వెళ్లిన ఆడబిడ్డ క్షేమంగా ఇంటికి వచ్చే వరకు తన తల్లిదండ్రులకు గుండె దడే.

గంట సేపు డప్పు కొట్టుకోవడం కాదు కావాల్సింది:

అన్నింటా ఆడది ఉంది అని చెబుతున్నారే కానీ.. ఎక్కడ ఎంత సమానత్వం ఇచ్చారు అనేది మాత్రం నీటి మీద రాతలుగానే మిగిలాయి. ఇప్పటికీ ఎంతో మంది తల్లిదండ్రులు తమ ఆడబిడ్డలను చదువుకోవడానికి పంపడానికి భయపడుతున్నారు. ఎందుకంటే విద్యాబుద్దులు నేర్పాల్సిన గురువులే నాగు పాములై కాటేస్తారనే భయంతో. తోడు ఉండాల్సిన తోడబుట్టిన వాడి బుద్ది ఎలా మారుతుందో చెప్పాలేని స్థితిలో మనం ఉన్నాం. అలాగే బతుకుతున్నాం. ఇన్ని గందరగోళాల మధ్య కూడా మనకి మహిళా దినోత్సవాలు కావాల్సిందే. మనం వేడుకలు జరుపుకోవాల్సిందే. వేడుకలు అంటూ ఆ గంట సేపు ఆడవారి గురించి గొప్పగా చెబితే కాదు... వారికి రక్షణ గా నిరంతరం ఉండాలి.. వారిని బతకనివ్వాలి. అప్పుడే నిజమైన మహిళ దినోత్సవాలు. వేడుకలు..పండుగలు.

పురాణాల్లో ఎక్కడ ఆడవారిని పూజిస్తే అక్కడ సకల దేవతలు కొలువై ఉంటారని ఉంది. కానీ నేటి రోజుల్లో(Now A Days) పూజలు మాట దేవుడెరుగు.. పూచిక పుల్లలు కంటే దారుణంగా తీసి పారేస్తూ సంవత్సరంలో ఒక రోజు మాత్రం మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపేస్తున్నారు.

Also Read : తిరుమలలో జాన్వీ కపూర్‌.. ఆమె వెంట ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా!

#womens-day #celebrations
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe