• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar
  • Skip to footer
Rtvlive.com

Rtvlive.com

News Updates from Andhra Pradesh and Telangana

  • నేషనల్
  • ఇంటర్నేషనల్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • క్రైం
  • సినిమా
  • లైఫ్ స్టైల్
  • ట్రెండింగ్
  • వైరల్
  • బిజినెస్
  • స్పోర్ట్స్
  • జాబ్స్
  • తెలంగాణ
    • హైదరాబాద్
    • ఖమ్మం
    • వరంగల్
    • మెదక్
    • మహబూబ్ నగర్
    • నిజామాబాద్
    • నల్గొండ
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
  • ఆంధ్రప్రదేశ్
    • విజయవాడ
    • తిరుపతి
    • వైజాగ్
    • ఒంగోలు
    • శ్రీకాకుళం
    • కర్నూలు
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • అనంతపురం
    • విజయనగరం
    • నెల్లూరు
    • గుంటూరు
    • కడప
  • హైదరాబాద్
  • వరంగల్
  • నిజామాబాద్
  • విజయవాడ
  • వైజాగ్
Home » టైటానిక్ గల్లంతైన ప్లేస్ యమడేంజర్ .. దర్శకుడు కామెరూన్ షాకింగ్ విషయాలు..!

టైటానిక్ గల్లంతైన ప్లేస్ యమడేంజర్ .. దర్శకుడు కామెరూన్ షాకింగ్ విషయాలు..!

Published on June 23, 2023 1:01 pm by Shareef Pasha

అట్లాంటిక్ మహాసముద్రంలో 13 వేల అడుగుల లోతులో ఉన్న టైటానిక్ నౌక శిథిలాలను చూసేందుకు ఐదుగురితో వెళ్లి గల్లంతైన టైటాన్‌ సబ్‌మెర్సిబుల్‌ కథ విషాదాంతమైంది. ఈ క్రమంలో టైటానిక్ మునిగిపోయిన ప్రాంతాన్ని అనేక సార్లు సందర్శించిన హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్.. ఆ ప్రదేశం గురించి గతంలో పంచుకున్న అనుభవాలు ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చాయి.

Translate this News:

అట్లాంటిక్ మహా సముద్రంలో 13 వేల అడుగుల లోతులో ఉన్న టైటానిక్ నౌక శిథిలాలను చూసేందుకు ఐదుగురితో వెళ్లి గల్లంతైన టైటాన్‌ సబ్‌మెర్సిబుల్‌ కథ విషాదాంతమైంది. తీవ్రమైన ఒత్తిడి వల్ల టైటాన్‌ పేలిపోయిందని, దీంతో అందులో ఉన్న ఐదుగురు పర్యాటకులు మరణించారని అమెరికన్‌ కోస్ట్‌గార్డ్‌ ప్రకటించింది. రిమోట్ కంట్రోల్డ్ వెహికల్ సాయంతో మినీ జలాంతర్గామి శకలాలను గుర్తించామని తెలిపింది. ఈ క్రమంలో టైటానిక్ మునిగిపోయిన ప్రాంతాన్ని అనేక సార్లు సందర్శించిన హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్. ఆ ప్రదేశం గురించి గతంలో పంచుకున్న అనుభవాలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి.

కామెరూన్.. ‘అవతార్’, ‘అవతార్-2’ సహా ఎన్నో భారీ చిత్రాలను తీసి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇక ఆయన తీసిన చిత్రాల్లో ‘టైటానిక్’ (Titanic) ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన ఓడ సముద్రంలో ప్రమాదానికి గురై ఎలా మునిగిపోయిందో కళ్లకు కట్టినట్లు చూపించారు. సముద్రగర్భంలో 13వేల అడుగుల లోతున ఉన్న ‘టైటానిక్’ను కామెరూన్ ఇప్పటికే 33 సార్లు సందర్శించాడు. ఈ సందర్భంగా ఆ అనుభవాలను 2012లో ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. ‘మనుషులు ఎప్పుడూ చూడని ప్రదేశాలకు వెళ్లడం అంటే నాకు చాలా ఇష్టం. అందుకే టైటానిక్ షిప్ మునిగిన ప్రాంతానికి వెళ్లా. ఈ భూమ్మీద అత్యంత క్రూరమైన ప్రదేశాల్లో ఇది ఒకటి’ అని చెప్పుకొచ్చారు.

ప్రపంచవ్యాప్తంగా జరిగిన అతిపెద్ద ఓడ ప్రమాదాల్లో టైటానిక్ ఎవరెస్ట్ వంటిది అని కామెరూన్ అన్నారు. ఓడ మునిగిపోయిన ప్రాంతాన్ని చూడాలనే ఆకాంక్షతోనే టైటానిక్ సినిమాను తీసినట్లు చెప్పారు. అంతేకానీ, ప్రత్యేకంగా దానిని ఒక సినిమాగా తీయాలనే ఉద్దేశ్యం మొదట్లో తనకు లేదన్నారు. మునిగిపోయిన టైటానిక్ ను చూడాలనే సముద్రగర్భంలో సబ్ మెరైన్ లో ప్రయాణించినట్లు చెప్పారు. దానిని బాగా చూపించాలనే ఉద్దేశ్యంతోనే పలుమార్లు టైటానిక్ మునిగిన ప్రాంతాన్ని సందర్శించినట్లు వెల్లడించారు.

మరోవైపు తప్పిపోయి అంతమైన టైటాన్ జలాంతర్గామిపై జేమ్స్ కామెరూన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. మాట్లాడిన ఆయన.. ఈ ఘటన తనకు ఏమాత్రం ఆశ్చర్యాన్ని కలిగించలేదన్నారు. ఇదో భయంకరమైన, విషాదాంతంగా భావిస్తున్నట్లు చెప్పారు. ‘కమ్యూనిటీలోని కొందరు ఈ జలాంతర్గామి గురించి చాలా ఆందోళన చెందారు. డీప్ సబ్ మెర్జెన్స్ ఇంజినీరింగ్ కమ్యూనిటీలోని కొంతమంది ముఖ్య సభ్యులు ఓషిగేట్ కంపెనీకి లేఖలు రాశారు. వారు చేస్తున్నది చాలా ప్రయోగాత్మకం’ అని జేమ్స్ కామెరూన్ వెల్లడించారు.

Primary Sidebar

INDvsAUS: రెండో వన్డేలో ఆస్ట్రేలియాను మట్టికరిపించిన భారత్.. 2-0తో సిరీస్ కైవసం

INDvsAUS: రెండో వన్డేలో ఆస్ట్రేలియాను మట్టికరిపించిన భారత్.. 2-0తో సిరీస్ కైవసం

Rajaiah: మరో బాంబ్ పేల్చిన రాజయ్య.. కడియంకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు

Rajaiah: మరో బాంబ్ పేల్చిన రాజయ్య.. కడియంకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు

Chandrababu: అక్టోబర్ 5 వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగింపు

Chandrababu: అక్టోబర్ 5 వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగింపు

Chandrababu: బీఆర్ఎస్ నేతలు చంద్రబాబుకు మద్దతు ఇవ్వడం వెనక రాజకీయ కారణం ఉందా..?

Chandrababu: బీఆర్ఎస్ నేతలు చంద్రబాబుకు మద్దతు ఇవ్వడం వెనక రాజకీయ కారణం ఉందా..?

IND vs AUS :  వర్షం కారణంగా  మ్యాచ్‎కు అంతరాయం...నిలిచిపోయిన ఆట..!!

IND vs AUS : వర్షం కారణంగా మ్యాచ్‎కు అంతరాయం…నిలిచిపోయిన ఆట..!!

PM Modi Mann ki Baat : చంద్రయాన్-3, జీ-20తో ప్రపంచం భారత్ వైపు చూస్తోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ..!!

PM Modi Mann ki Baat : చంద్రయాన్-3, జీ-20తో ప్రపంచం భారత్ వైపు చూస్తోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ..!!

VandeBharat Express : తెలుగు రాష్ట్రాలకు మోదీ కానుక..ఒకేసారి రెండు వందే భారత్ రైళ్లు ప్రారంభించిన ప్రధాని..!!

VandeBharat Express : తెలుగు రాష్ట్రాలకు మోదీ కానుక..ఒకేసారి రెండు వందే భారత్ రైళ్లు ప్రారంభించిన ప్రధాని..!!

వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరగనున్న డీజిల్, పెట్రోల్ ధరలు..!!

వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరగనున్న డీజిల్, పెట్రోల్ ధరలు..!!

Footer

Copyright © 2023 · Rayudu Vision Media Limited | Technology Powered by CultNerds
About Us | Disclaimer | Contact Us | Feedback & Grievance | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap
RTV News provides latest Telugu Breaking News, Political News
Telangana & AP News headlines Live, Latest Telugu News Online