ఇక అసలు విషయానికొస్తే.. బ్రెజిలియన్ ఫుట్‌బాల్ క్లబ్స్ అయిన పాల్మీరాస్, రైవల్స్ ఫ్లెమింగోల మధ్య అలియాంజ్ పార్క్ స్టేడియంలో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌కు పాల్మీరాస్కు మద్దతుగా గాబ్రిలా అనెల్లి హాజరైంది. కాగా అలియాంజ్ పార్క్ స్టేడియం బయట ఉన్న పాల్మీరాస్ ఫ్యాన్ జోన్‌కు దగ్గర్లో నిలబడడమే గాబ్రిలా చేసిన పెద్ద పొరపాటు. ఏదో విషయమై ఇరు జట్ల అభిమానుల మధ్య గొడవ మొదలైంది. కాసేపటికి రైవల్స్ ఫ్లెమింగో ఫ్యాన్స్ రాళ్లు, గ్లాస్ బాటిల్స్‌తో పరస్పరం దాడి చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో ఒక గ్లాస్ బాటిల్ గాబ్రిలా దిశవైపుగా వేగంగా దూసుకొచ్చింది. ఆ గ్లాస్ బాటిల్ నేరుగా గాబ్రిలా మెడ నరాన్ని కట్ చేసుకుంటూ వెళ్లింది. దీంతో అపస్మారక స్థితిలోకి చేరిన గాబ్రిలా అక్కడికక్కడే కుప్పకూలింది. తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. కాగా రెండురోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆమె సోమవారం ఆసుపత్రిలో మరణించిందని కుటుంబసభ్యులు తెలిపారు. ఇక గాబ్రిలా మరణాన్ని ఆమె సోదరుడు ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకోవడంతో ఇది చూసిన వారందరిని కలచివేసింది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాబ్రిలా మృతికి కారణమైన రైవల్స్ ఫ్లెమింగో అభిమానిని అదుపులోకి తీసుకున్నారు. అయితే తన దాడి కారణంగా ఒకరి ప్రాణం తీస్తుందని ఊహించలేదని.. నిందితుడు బాధితురాలి కుటుంబసభ్యులను క్షమాపణ కోరినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా పాల్మీరాస్ క్లబ్ మాత్రం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. అభిమాని మృతికి కారణమైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని కోరింది. ఇక గొడవ పడిన అభిమానులను వేరు చేయడానికి పెప్పర్ స్ప్రే ఉపయోగించాల్సి వచ్చిందని పోలీసులు స్పష్టం చేశారు.