రన్‌వేలో ఫెన్సింగ్‌ను ఢీకొన్న విమానం, వైరల్‌ అవుతున్న వీడియో

అటుగా వస్తున్న ఓ విమానం.. రన్‌వే నుంచి పక్కకు దూసుకెళ్లింది. ఫెన్సింగ్‌ను ఢీకొట్టి ఎక్కడికక్కడికి ముక్కలైంది. అయితే అదృష్టవశాత్తు ఆ విమానంలోని సిబ్బంది, ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. ఎవరికి ఏం కాకపోవడం, అందరూ సురక్షితంగా ప్రాణాలతో బయటపడటంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు కాస్త సోషల్‌మీడియాలో తెగ చెక్కర్లు కొడుతున్నాయి.

రన్‌వేలో ఫెన్సింగ్‌ను ఢీకొన్న విమానం, వైరల్‌ అవుతున్న వీడియో
New Update

ఒక విమానం రన్‌వే నుంచి పక్కకు దూసుకెళ్లింది. ఫెన్సింగ్‌ను అది ఢీకొట్టి ముక్కలైంది. అయితే అదృష్టవశాత్తు విమానంలోని సిబ్బంది, ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. సొమాలియా రాజధాని మొగదీషులో ఈ మిరాకిల్‌ ఘటన చోటుచేసుకుంది. జూలై 11న మధ్యాహ్నం 12:23 గంటలకు హల్లా ఎయిర్‌లైన్‌కు చెందిన ఈ 120 విమానం క్రాష్‌ ల్యాండ్‌కు ప్రయత్నించింది. రాజధాని మొగదీషులోని అడెన్ అడ్డే అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్‌ వేపై దిగుతుండగా ఆ విమానం అదుపుతప్పింది.

రన్‌ వేకు ఒక పక్కగా ఉన్న ఫెన్సింగ్‌ వైపు వేగంగా దూసుకెళ్లింది. ఫెన్సింగ్‌ను ఢీకొట్టిన ఆ విమానం పలు ముక్కలైంది. దాని రెక్కలు విరిగిపోయాయి. టైర్లు ఊడిపోయాయి. అయినప్పటికీ ఆ విమానం సిబ్బందితోపాటు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఇద్దరు స్వల్పంగా గాయపడినట్లు సొమాలి సివిల్ ఏవియేషన్ అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో సిబ్బంది, ప్రయాణికులు కలిపి మొత్తం 34 మంది ఆ విమానంలో ఉన్నట్లు చెప్పారు.

కాగా.. ఈ విమాన ప్రమాదంపై సొమాలి సివిల్ ఏవియేషన్ అథారిటీ (ఎ.స్సీ.ఏ.ఏ) దర్యాప్తునకు ఆదేశించింది. విమానం రన్‌వే నుంచి పక్కకు ఎందుకు వెళ్లిందో అన్నదానికి సరైన కారణం తెలియలేదని పేర్కొంది. పైలట్‌ కూడా ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌కు ఎలాంటి ఫిర్యాదులు చేయలేదని తెలిపింది. దర్యాప్తు తర్వాతే అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పింది. మరోవైపు విమానం అదుపు తప్పి రన్‌వే నుంచి పక్కకు దూసుకెళ్లి ఫెన్సింగ్‌ను ఢీకొని ముక్కలైన వీడియో క్లిప్‌ కాస్త సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు అదృష్టం అంటే మీదే భయ్యా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe