స్పెయిన్‌ను ముంచెత్తిన వరదలు, భయాందోళనలో ప్రజలు

ఆకస్మిక వరదలతో స్పెయిన్‌ విలవిలలాడిపోతోంది. ఒకవైపు వడగళ్ల వాన, మరోవైపు పోటెత్తిన వరదతో స్థానికులు వణికిపోతున్నారు. భారీ వర్షాలతో జర్గోజా ప్రావిన్స్‌ నీటమునిగింది. రోడ్లపైకి భారీగా వరదనీరు ముంచెత్తడంతో కార్లు కొట్టుకుపోయాయి. ఒక్కసారిగా పోటెత్తిన వరద చుట్టుముట్టేయడంతో కార్లలో ఉన్న ప్రయాణికులు బయటకు రాలేక పలువురు అందులోనే చిక్కుకుపోయి బిక్కుబిక్కుమంటున్నారు. దీంతో స్పెయిన్‌ వీధులన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

New Update
స్పెయిన్‌ను ముంచెత్తిన వరదలు, భయాందోళనలో ప్రజలు

ఐతే మరో రెండ్రోజులు స్పెయిన్‌లో భారీ వర్షాలు పడే అవకాశముందని అక్కడి వాతావరణ శాఖాధికారులు అంచనా వేస్తున్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత బీభత్సం సృష్టించే అవకాశముందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. జర్గోజా ప్రావిన్స్‌ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని హాహాకారాలు చేశారు. తమను కాపాడాలంటూ ఆర్తనాదాలు పెట్టారు. ఎట్టకేలకు అక్కడికి చేరుకున్న రెస్క్యూ టీమ్‌ పలువురిని కాపాడింది. దీంతో దినదినగండంగా తయారైంది స్పెయిన్‌ పరిస్ధితి. సిటీ అంతా కూడా పూర్తిగా నీటితో నిండిపోయింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి.

స్పెయిన్‌లోని వరద భీభత్సం కారణంగా జర్గోజా ప్రావిన్స్‌ కొంతమంది వరదలో కొట్టుకుపోయిన కార్లు కొంతమంది గల్లంతైనట్లు స్దానిక పోలీసులు వెల్లడించారు. కార్లలో చిక్కుకుపోయిన వారంతా హాహాకారాలతో వణికిపోతున్నారు. వరదలో చిక్కుకుపోయి చాలామంది ప్రాణాలను కోల్పోయిన పరిస్థితి నెలకొంది. ప్రతి సంవత్సరం స్పెయిన్‌ను వర్షాకాలంలో తీవ్రమైన వరదల కారణంగా చాలా మరణాలు సంభవించడంతో పాటు, వ్యాధులు వ్యాపిస్తుంటాయని అక్కడి స్దానికులు వాపోతున్నారు. ఈ వరదల దృష్ట్యా వ్యవసాయ భూములతో పాటు స్ధానిక రోడ్లు సైతం విధ్వంశానికి గురికావాల్సిన పరిస్ధితి నెలకొందని అధికారులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. స్పెయిన్‌లోని స్ధానికులు బిక్కుబిక్కుమంటూ కాలాన్ని ఎల్లదీస్తున్నారు. ఎందుకంటే భారీ వరదల కారణంగా ప్రజలందరూ బయటకు పోలేక ఇండ్లలోనే ఉండాల్సిన పరిస్ధితి నెలకొంది. దీంతో అధికారులు అక్కడి వారి కోసం సహాయక చర్యలు చేపడుతున్నారు. వారి నిత్యవసర వస్తువులను అందించే దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా అత్యవసర వేళల్లో తప్పా ఎవరు కూడా బయటకు రాకూడదని అధికారులు ప్రజలను హెచ్చరించారు.

Advertisment
తాజా కథనాలు