పైలట్‌కి అస్వస్థత, గాల్లో ఉండగానే ఫ్లైట్‌ను కంట్రోల్‌ చేసిన 68 ఏళ్ల బామ్మ

ఓ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఇంకాసేపట్లో ఫ్లైట్‌ ల్యాండింగ్ అవుతుందనగా ఫ్లైట్‌లో ఉన్న పైలట్‌ ఉన్నట్టుండి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అయితే ఓ 68 ఏళ్ల ప్రయాణికురాలు వెంటనే అప్రమత్తమై ఆ విమానాన్ని ఆమె కంట్రోల్ చేసి సురక్షితంగా కిందకు దించేసింది. దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది. నిజంగా నువ్వు బామ్మవి కాదు, దేవతవి అంటూ విమాన ప్రయాణికులు కృతజ్ఞతలు తెలియజేశారు.

New Update
పైలట్‌కి అస్వస్థత, గాల్లో ఉండగానే ఫ్లైట్‌ను కంట్రోల్‌ చేసిన 68 ఏళ్ల బామ్మ

ఇంట్లో నుండి బయటికి వచ్చిన వ్యక్తి తిరిగి ఇంటికి వెళ్లేంత వరకు ప్రాణాలపై నమ్మకం లేని రోజులు ఇవి. ఎందుకంటే చాలామంది అనుకోని సంఘటనల కారణంగా ఎన్నో ప్రమాదాలకు గురవుతున్నారు. వాటి నివారణకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికి ప్రమాదాలు ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రయాణికులు అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదాల నుండి వారి ప్రాణాలను కాపాడుకోవచ్చు. ఇటీవల జరిగిన ఫలక్ నుమా ఎక్స్‌ప్రెస్ అగ్ని ప్రమాదంలో ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో ఎటువంటి ప్రాణహాని జరగలేదు.

https://twitter.com/anny25717503/status/1680609626167865349?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1680609626167865349%7Ctwgr%5Ea7c2b907587b4bb3142ffb4674b8ec82ff7117c7%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fsumantv.com%2Ftelugu-news%2Fnews%2Finternational%2Fadventure-of-a-woman-at-the-age-of-68-395658.html

విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం

అయితే ఇదిలా ఉంటే.. ప్రతి ఒక్కరు ఏదో ఓ ప్రమాదానికి గురి అవుతున్నారు. ప్రమాదాల బారిన పడి చాలామంది ప్రాణాలను కోల్పోతున్నారు. తాజాగా ఓ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. ఓ ఫ్లైట్ గమ్యస్థానాన్ని చేరుకుంది. కొద్దిసేపట్లో ల్యాండింగ్ అవుతుందనే సమయంలో పైలట్ తీవ్రంగా అస్వస్థతకు గురయ్యాడు. దీంతో విమానంలో మహిళా ప్రయాణికురాలు సమయస్ఫూర్తితో వ్యవహరించి.. సాహసోపేత నిర్ణయం తీసుకుందంటూ తనని పొగడ్తలతో ముంచేస్తున్నారు.

సేఫ్‌గా ల్యాండింగ్ చేసిన 68 ఏళ్ల బామ్మ

అసలు విషయం ఏంటంటే.. న్యూయార్క్‌లోని వెస్ట్‌చెస్టర్ కౌంటీ నుంచి విన్‌యార్డ్‌కు 2006 పైపర్ మెరీడియన్ అనే మినీ విమానం బయలుదేరింది. విన్‌యార్డ్ చేరుకుని ల్యాండింగ్ సమయంలో పైలట్ కు తీవ్రమైన అస్వస్థత ఏర్పడింది. దీంతో విమానంలో ఉన్న మహిళా ప్రయాణికురాలు ఫ్లైట్‌ను తన కంట్రోల్‌లోకి తీసుకుంది. ఆ ప్రయత్నంలో విమానాన్ని సేఫ్‌గా ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా రన్‌వేకు సమీపంలోనే ఓ వైపు ఓరిగిపోయింది. విమానం ఎడమవైపు ఉన్న రెక్క సగానికి విరిగిపోయింది. తక్షణమే అక్కడకు ఎమర్జెన్సీ రెస్క్యూ టీం చేరుకున్నారు. అందులోని పైలట్‌తోపాటుగా మహిళా ప్రయాణికురాలిని ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ పైలట్ ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలిపారు. మహిళ స్వల్ప గాయాలతో బయటపడిందని పోలీసులు వెల్లడించారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు