International Mother Language Day: మాతృభాష అంటే సాంస్కృతిక వారధి.. దానిని కాపాడుకోవడం అందరి విధి.. 

ప్రపంచంలో అంతరించిపోతున్న భాషలను సంరక్షించడం.. ప్రజలను వారి మాతృభాషను ఉపయోగించేలా ప్రోత్సహించడం అలాగే భాషా వైవిధ్యం ప్రాముఖ్యతపై అవగాహన పెంచడం లక్ష్యంగా ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం జరుపుకుంటారు. దీని గురించి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో చూడవచ్చు. 

International Mother Language Day: మాతృభాష అంటే సాంస్కృతిక వారధి.. దానిని కాపాడుకోవడం అందరి విధి.. 
New Update

International Mother Language Day: ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేసుకోవడానికి భాష పునాది. భాష అనేది సాంస్కృతిక వారధి అని చెప్పవచ్చు. మాతృ భాష లో మాట్లాడుకోవడం అంటే, మనసులను దగ్గర చేసుకోవడం. మన సంప్రదాయాన్ని లేదా సంస్కృతిని సరిగ్గా ప్రెజెంట్ చేయాలంటే మాతృభాషను మించినది ఏదీ ఉండదు. కానీ, జీవితంలో మన భాషతో మనం ఎదగగలమా? అంటే, మన భాష ఒక్కటే మనకు తెలిస్తే ప్రపంచంతో కమ్యూనికేట్ ఎలా అవగలం? మాతృభాష ఎంత ముఖ్యమో మిగిలిన భాషల్లో కమ్యూనికేట్ చేయగలిగిన పరిజ్ఞానం కూడా అంతే ముఖ్యం. ప్రపంచంలో ఎన్నో భాషలున్నాయి. వాటికీ మరెన్నో యాసలు ఉన్నాయి. అంతెందుకు మనదేశంలోనే చాలా భాషలు.. ఆ భాషలకు ప్రాంతాలను బట్టి యాసలు ఉన్నాయి. మన తెలుగునే తీసుకుంటే, ఉత్తరాంధ్రలో ఒకలా.. గోదావరి జిల్లాల్లో మరోలా.. రాయలసీమలో వేరేరకంగా.. యాస ఉంటుంది. ఇది గందరగోళంగా ఉన్నా.. భిన్నత్వంలో ఉండే అందం కనిపిస్తుంది. కమ్యూనికేషన్ సక్రమంగా ఉండాలన్నా.. వ్యక్తుల మధ్య సంబంధాలు చక్కగా నిలవాలన్నా ఒకరి భాషను ఒకరు గౌరవించుకోవడం.. గుర్తించడం.. అర్ధం చేసుకోవడం చాలా అవసరం. ఈ విషయాన్ని చాటి చెప్పడమే ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే అంటే అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం(International Mother Language Day) ముఖ్య ఉద్దేశ్యం. ఈరోజు అనే ఫిబ్రవరి 21 ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే ఈ సందర్భంగా దీని గురించి అర్ధం చేసుకుందాం. 

అసలు ఇది ఎందుకు ప్రారంభించారు?

ఇప్పటి బంగ్లాదేశ్ లో 1952,ఫిబ్రవరి 21న జరిగిన ఘర్షణ దీని వెనుక కారణం. అప్పట్లో బాంగ్లాదేశ్ తూర్పు పాకిస్తాన్ గా ఉండేది. పాకిస్తాన్ ప్రభుత్వం దేశంలో ఉర్దూ ఒక్కటే అధికారిక భాషగా ఉండాలని చెప్పింది. దీనిని తూర్పు పాకిస్తాన్ లోని విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ నిరసనలను అడ్డుకోవడానికి పోలీసులు జరిపిన కాల్పుల్లో చాలామంది మరణించారు. ఈ సంఘటన బంగ్లాదేశ్ స్వాత్రంత్ర పోరాటానికి ప్రత్యేక మలుపు తీసుకువచ్చింది. ఇది బెంగాలీ భాష, సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పింది. ఈ సంఘటనలను గుర్తుచేసుకోవడానికి, ప్రపంచవ్యాప్తంగా భాషా, సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రోత్సహించడం కోసం ఫిబ్రవరి 21 తేదీని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం(International Mother Language Day)గా ప్రకటించాలని యునెస్కోకు 1999లో బంగ్లాదేశ్ ప్రతిపాదించింది. దీనిని యునెస్కో ఆమోదించింది. 

ప్రపంచవ్యాప్తంగా ఎన్ని భాషలున్నాయంటే..

ప్రపంచవ్యాప్తంగా 7 వేల భాషలు మాట్లాడతారనేది ఒక అంచనా. అందులో ఒక్క భారతదేశంలోనే 2 వేలకంటే ఎక్కువ భాషలు మాట్లాడతారు. మన దేశంలో వందల కిలోమీటర్లకు భాషా-సాంస్కృతిక వైవిధ్యం మారుతుంది. 

అయితే, భారత రాజ్యాంగం బెంగాలీ, హిందీ, తమిళం, తెలుగు, మరాఠీలతో సహా 22 అధికారిక భాషలను గుర్తించింది. ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషలలో హిందీ, బెంగాలీ, మరాఠీ కూడా ఉన్నాయి. అంతేకాకుండా.. భారతదేశం షెడ్యూల్ చేయని అనేక భాషలను మాట్లాడే ప్రజలతో ఉంటుంది. 

Also Read: మేడారం జాతర ఏ ఊరి నుంచి ఎంత దూరం, ఎంత ఛార్జ్?.. ఫుల్ లిస్ట్ ఇదే..!!

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం(International Mother Language Day) లక్ష్యం అన్ని భాషల రక్షణను ప్రోత్సహించడం.  ముఖ్యంగా అంతరించిపోతున్న భాషలను సంరక్షించడం.  అలాగే ప్రజలను వారి మాతృభాషను ఉపయోగించమని ప్రోత్సహించడం. సాంస్కృతిక అవగాహన, శాంతియుత సహజీవనం, స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడంలో భాషా వైవిధ్యం ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడం కూడా ఈ రోజు లక్ష్యంగా ఉంటుంది. 

ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని(International Mother Language Day) నిర్వహించుకోవడం కోసం ఒక థీమ్ రూపొందిస్తారు. మొత్తంమీద, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం జరుపుకోవడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులు..  సంఘాలు ఒకచోట చేరి, భాషా- సాంస్కృతిక వైవిధ్యాన్ని జరుపుకోవడానికి అలాగే, అన్ని భాషల ఉపయోగం, రక్షణను ప్రోత్సహించడానికి, ముఖ్యంగా అంతరించిపోతున్న వాటిని ప్రోత్సహించడానికి ఒక వేదికను అందిస్తుంది.

Watch this interesting Video:

#international-mother-language-day #languages
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe