ఒడ్డుకు చేరిన మినీ టైటాన్ శకలాలు.. మానవ అవశేషాలు స్వాధీనం..

టైటానిక్ నౌక శిథిలాలను చూసేందుకు వెళ్లిన ఐదుగురు తీవ్ర పీడనం కారణంగా సముద్ర గర్భంలో కలిసిపోయిన టైటాన్‌ సబ్‌మెర్సిబుల్‌ కథ విషాదాంతమైన విషయం తెలిసిందే. తీవ్ర పీడనం వల్ల అది పేలిపోయి అందులో ట్రావెల్‌ చేస్తున్న ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పేలిపోయిన టైటాన్‌ సబ్‌మెర్సిబుల్‌ శకలాలు ఒడ్డుకు చేరాయి. వాటిలో మానవ అవశేషాలను అధికారులు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు.

ఒడ్డుకు చేరిన మినీ టైటాన్ శకలాలు.. మానవ అవశేషాలు స్వాధీనం..
New Update

అట్లాంటిక్ మహా సముద్రంలో 13 వేల అడుగుల లోతులో ఉన్న టైటానిక్ నౌక శిథిలాలను చూసేందుకు ఐదుగురితో వెళ్లి గల్లంతైన టైటాన్‌ సబ్‌మెర్సిబుల్‌ కథ విషాదాంతమైన విషయం తెలిసిందే. తీవ్ర పీడనం వల్ల అది పేలిపోయి.. అందులోని ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కాగా, ఈ సాహసయాత్రలో పేలిపోయిన టైటాన్ జలాంతర్గామి శకలాలు తాజాగా తీరాన్ని చేరాయి. కెనడాలోని న్యూఫౌండ్ లాండ్ అండ్ లాబ్రడార్ ప్రావిన్సులో సెయింట్ జాన్స్ ఓడరేవుకు బుధవారం వాటిని తీసుకొచ్చినట్లు యూఎస్ తీర రక్షణ దళం అధికారులు బుధవారం వెల్లడించారు.

సముద్ర గర్భం నుంచి అతికష్టం మీద బయటకు తీసిన ఈ మినీ టైటాన్ శకలాల్లో మానవ అవశేషాలను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. కాగా, స్వాధీనం చేసుకున్న శకలాలు, మానవ అవశేషాలను వైద్య పరిశోధకులు పరిశీలిస్తారని యూఎస్ కోస్ట్ గార్డ్ తెలిపింది. జలాంతర్గామి పేలిపోవడానికి కారణాలేంటో తెలుసుకునేందుకు జరుగుతున్న దర్యాప్తులో ఇవి కీలకం కానున్నాయి. వీటిని పరిశీలించిన తర్వాత ప్రమాదం జరిగిన తీరు.. వాళ్లెలా చనిపోయారన్న దానిపై ఓ అంచనాకు రావొచ్చని అధికారులు భావిస్తున్నారు.

శతాబ్దం క్రితం అట్లాంటిక్ మహా సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు.. ఓషన్ గేట్ ఎక్స్ పిడీషన్స్ అనే సంస్థ ఈ సాహసయాత్రను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ యాత్రకు ఈనెల 18వ తేదీన మినీ టైటాన్ బయలు దేరింది. ఈ మినీ జలాంతర్గామిలో 96 గంటలకు సరిపాడా ఆక్సిజన్ ఉంది. అయితే, సాగరగర్భంలోకి వెళ్లిన గంటా 45 నిమిషాల తర్వాత టైటాన్ తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో దాని జాడ కోసం కెనడా, అమెరికా దళాలు సముద్రాన్ని నాలుగు రోజుల పాటు జల్లెడపట్టాయి. అయినా ఫలితం లేకపోయింది. సముద్రం లోపల తీవ్రమైన ఒత్తిడి వల్ల టైటాన్‌ పేలిపోయింది. అందులోని ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మినీస‌బ్ ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన బాధితుల్లో పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారి ష‌హ‌జాద్ దావూద్‌, అతడి కుమారుడు సులేమాన్ దావూద్‌, బ్రిటిష్ సంపన్నుడు 58 ఏళ్ల హ‌మీష్ హార్డింగ్‌, ఓషియన్ గేట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టాక్టన్ రష్, పరిశోధకుడు పాల్ హెన్రీ ఉన్నారు.

https://twitter.com/ChinaDaily/status/1674253442511171584

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe