Solar Roof Top Policy: రూఫ్‌టాప్‌ సోలార్‌ పాలసీ సబ్సిడి పొందడం ఎలా..?

రూఫ్‌టాప్‌ సోలార్‌ పాలసీ సబ్సిడి పొందడం ఎలా..? రూఫ్‌టాప్‌ సోలార్‌ పాలసీతో ఎన్ని ఇళ్లకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నారు? రూఫ్‌టాప్‌ సోలార్‌ పాలసీలో ఎన్ని కేటగిరిలున్నాయి? దీనిపై పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ మొత్తాన్ని చదవండి.

New Update
Solar Roof Top Policy: రూఫ్‌టాప్‌ సోలార్‌ పాలసీ సబ్సిడి పొందడం ఎలా..?

Solar Roof Top Policy: ప్రభుత్వం ప్రతిపాదించిన రూఫ్‌టాప్ సోలార్ స్కీమ్- ప్రధానమంత్రి సూర్యోదయ యోజన- లబ్ధిదారులకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లభిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్‌లో ప్రకటించారు.

రూఫ్‌టాప్‌ సోలార్‌ పాలసీ సబ్సిడి పొందడం ఎలా..?

స్టెప్-1
https://solarrooftop.gov.in/consumerRegistration పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి

స్టెప్-2
వినియోగదారుడి నెంబర్‌, మొబైల్‌ నెంబర్‌ ద్వారా లాగిన్‌ అవ్వాలి

స్టెప్-3
అప్రూవల్‌ వచ్చిన తర్వాత డిస్కమ్‌ అనుమతి ఉన్న వెండర్‌ ద్వారా సోలార్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకోవాలి

స్టెప్-4
సోలార్‌ ప్లాంట్‌ వివరాలు సమర్పించి మీటర్‌కు అప్లికేషన్‌ పెట్టుకోవాలి

స్టెప్-5
మీటర్‌ పెట్టిన తర్వాత డిస్కమ్‌ అధికారులు తనిఖీ చేసి సంబంధిత వివరాలను పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేస్తారు

స్టెప్-6
డిస్కమ్‌ రిపోర్టు వెరిఫికేషన్‌ తర్వాత సబ్సిడీ నగదు వినియోగదారుడి బ్యాంక్‌ ఖాతాలో జమ అవుతుంది

--> రూఫ్‌టాప్‌ సోలార్‌ పాలసీతో కోటి ఇళ్లకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌

--> రూఫ్‌టాప్‌ సోలార్‌ పాలసీలో రెండు కేటగిరిలు

మొదటి కేటగిరి:
0-3 కిలోవాట్ల వరకు కిలోవాట్‌కు రూ.18 వేల సబ్సిడి
3-10 కిలోవాట్ల వరకు కిలోవాట్‌కు రూ.9 వేల సబ్సిడి

స్పెషల్‌ కేటగిరి:
0-3 కిలోవాట్ల వరకు కిలోవాట్‌కు రూ.20 వేల సబ్సిడీ.
3-10 కిలోవాట్ల వరకు కిలోవాట్‌కు రూ. 10 వేల సబ్సిడీ.
(సిక్కిం, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్‌, లక్షద్వీప్‌, అండమాన్‌ అండ్‌ నికోబార్‌లోని విద్యుత్‌ వినియోగదారులకు మాత్రమే స్పెషల్‌ కేటగిరి వర్తిస్తుంది)

--> 2024 జనవరి 1 తర్వాత నేషనల్‌ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకునేవాళ్లకు సబ్సిడి వర్తింపు.

--> మేడిన్‌ ఇండియా సోలార్‌ ప్యానెల్స్‌/మాడ్యూల్స్‌ మాత్రమే వినియోగించాలి.

--> సోలార్‌ ఇన్సిస్టిలేషన్‌కు సంబంధించి వెండర్‌ నుంచి ధృవీకరణ పత్రం అవసరం.

--> డిస్కమ్‌ ధృవీకరించిన మొత్తం సోలార్‌ మాడ్యూల్‌ కేపాసిటీ, ఇన్వర్టర్‌ కెపాసిటీ ఆధారంగా సబ్సిడిని లెక్కిస్తారు.

Also Read: రైతులకు నిరాశ మిగిల్చిన మధ్యంతర బడ్జెట్!

WATCH:

Advertisment
తాజా కథనాలు