Miheeka: నేను పాండాలాగే మారిపోతా.. రానా భార్య పోస్ట్ వైరల్

నటుడు దగ్గుబాటి రానా భార్య మిహికా బజాజ్.. అమ్మతనం గురించి ఆసక్తికరమైన పోస్ట్ షేర్ చేసింది. గర్భంతో ఉన్న పాండాను చూపిస్తూ 'నా లైఫ్ లో ఇలాంటి రోజు వచ్చినప్పుడు నేను నిజమైన పాండాగా మారిపోతా. నాకు అత్యంత సంతోషకరమైన, మరపురాని రోజు కూడా అదే అవుతుంది' అని చెప్పింది.

New Update
Miheeka: నేను పాండాలాగే మారిపోతా.. రానా భార్య పోస్ట్ వైరల్

టాలీవుడ్ యంగ్ హీరో దగ్గుబాటి రానా (Rana) భార్య మిహిక బజాజ్ (Mihika Bajaj) ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ తో జనాలకు ఆశ్చర్యానికి గురి చేసింది. కొంతకాలం రానాతో డేటింగ్ చేసి 2020లో పెళ్లి చేసుకున్న ఆమె నిరంతరం నెట్టింట యాక్టివ్ గా ఉంటోంది. భర్త రానాతో కలిసి పంచుకున్న స్వీట్ మెమోరీస్ తన ఫాలోవర్లతో షేర్ చేసుకుంటూ భారీ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా జంతు ప్రేమకు సంబంధించి ఆసక్తికరమైన పోస్ట్ పెట్టగా వైరల్ అవుతోంది.

publive-image

మరపురాని రోజు..
ఈ మేరకు సరదాగా ఓ పార్కుకు వెళ్లినట్లు చెప్పిన మిహిక బజాజ్ అక్కడ దిగిన ఫొటోలను నెట్టింట పోస్ట్ చేసింది. ఇందులో పాండాల దగ్గర దిగిన ఫోటోను ప్రత్యేకంగా పోస్ట్ చేస్తూ.. ‘నా గురించి తెలిసినవారు ఎవరైనా పాండాల పట్ల నాకున్న ప్రేమను అర్థం చేసుకుంటారు. ఇది జంతువులు మాత్రమే కాదు. స్వచ్ఛమైన ఆనందం. క్యూట్ నెస్. సరదాతనం. ఉల్లాసంతో నిండివున్నాయి. మన కడుపులో బిడ్డ ఎలాగైతే మనల్ని తన్నుతుంటే ఆనందిస్తామో? అలాంటి పరిపూర్ణమైన స్వరూపాన్ని వాటిలో చూస్తున్నా. అయితే నా లైఫ్ లో ఆ రోజు వచ్చినప్పుడు నేను నిజమైన పాండాగా మారిపోతా. ఇలాంటి ఫీలింగ్ కేవలం అద్భుతమైనదే కాదు.. నా జీవితంలో ఓ కల నిజమైనట్లే. అంతేకాదు నా లైఫ్ లో అత్యంత సంతోషకరమైన, మరపురాని రోజు కూడా అదే అవుతుంది’అంటూ అమ్మతనం గురించి గొప్పగా రాసుకొచ్చింది మిహిక.

publive-image

ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా.. ఫ్యాన్స్ పాజిటీవ్ కామెంట్లతో ఆమెను పొగిడేస్తున్నారు. మరికొంతమంది నెటిజన్లు మాత్రం షాక్ అవుతున్నారు. పిల్లలకోసం ఆరాటపడుతోంది పాపం. రానా భయ్యా త్వరగా గుడ్ న్యూస్ చెప్పు అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

#pandamonium #miheekabajaj #mother-value
Advertisment
తాజా కథనాలు