AP Assembly: ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రుల ప్రమాణ స్వీకారం తరువాత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి (YS Jagan) ప్రొటైం స్పీకర్ గొరంట్ల బుచ్చయ్య చౌదరి అవకాశం ఇచ్చారు. చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రధాన ప్రతిపక్షనేత హోదా లేకపోయినా కూడా మంత్రుల తరువాత 26వ సభ్యునిగా జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబుతో సహా సభ్యులందరికీ జగన్ అభివందనం చేయగా.. జగన్‌కు ప్రతి నమస్కారం చేశారు సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu).
Also Read: ‘జగన్ బాయ్ బాయ్’.. మాజీ ముఖ్యమంత్రికి చేదు అనుభవం..!
జగన్ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఆయన ముఖ కవళికలను బిగ్ స్క్రీన్‌పై ఆసక్తిగా గమనించారు చంద్రబాబు, మంత్రులు, ఎమ్యెల్యేలు. జగన్ సభలోనికి వచ్చి కూర్చోగానే బీజేపీ ఎమ్యెల్యే విష్ణుకుమార్ రాజు ఆయన వద్దకు వెళ్లి చేతులు కలిపి నమస్కరించారు. ప్రమాణ స్వీకారం చేసిన తరువాత బీజేపీకి చెందిన మంత్రి సత్యకుమార్ జగన్ వద్దకు వెళ్లి చేతులు కలిపారు. తాను ప్రమాణస్వీకారం చేసిన వెంటనే సభ నుంచి జగన్ బయటకు వెళ్లిపోయారు. సభలో వున్నంతసేపు జగన్ ముభావంగా కనిపించారు.