మిస్సింగ్ మిస్టరీ.. ఆ ముగ్గురు ఎక్కడ?

విశాఖలో ఇంటర్ విద్యార్థుల మిస్సింగ్ మిస్టరీగా మారింది. ఈనెల 24న కాలేజీకని చెప్పి వెళ్లిన ముగ్గురు కనిపించకుండా పోయారు. వీరు శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నారు. ముగ్గురిలో ఇద్దరిది నవాబ్ నగర్ కాగా.. మరొకరిది ప్రియదర్శిని కాలనీ. పోలీసులు వీరికోసం గాలిస్తున్నారు.

New Update
మిస్సింగ్ మిస్టరీ.. ఆ ముగ్గురు ఎక్కడ?

Inter students are missing in Gajuwaka

విశాఖలోని గాజువాకలో ముగ్గురు ఇంటర్ విద్యార్థుల మిస్సింగ్ కేసు నమోదైంది. ఈనెల 24వ తేదీన పవన్, దిలీప్, బాబీ కాలేజీకి వెళ్తున్నామని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లి.. కాలేజీకి వెళ్లకుండా కనిపించకుండా పోయారు. వీరు స్థానిక శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నారు.

24వ తేదీన కే కోటపాడు వెళ్లి అక్కడ నుండి కనిపించకుండా పోయారు విద్యార్థులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు గాజువాక పోలీసులు.

మిస్ అయిన విద్యార్థుల వివరాలు

1. గుండ్రెడ్డి ఉమేష్ పవన్,
S/o వెంకట నాయుడు,
వయస్సు 16 సంవత్సరాలు,
నవాబ్ నగర్

2. పిల్లల దిలీప్,
S/o గంగరాజు,
వయస్సు 16 సంవత్సరాలు,
ప్రియదర్శిని కాలనీ

3. యు దంతేశ్వరి అలియాస్ బాబీ,
S/o లేట్ రవి
వయస్సు 16 సంవత్సరాలు
నవాబ్ నగర్

వీరిని వీలైనంత త్వరగా ఎక్కడున్నదీ కనిపెడతామని పోలీసులు చెబుతున్నారు. మొబైల్ ఫోన్లను ట్రాక్ చెయ్యడం ద్వారా కనిపెట్టేందుకు వీలు ఉంది. టెక్నాలజీని ఉపయోగించేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు. ఇవాళ లేదా రేపటి కల్లా ఆచూకీ తెలిసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు