Konaseema: కోనసీమలో అంతరరాష్ట్ర బ్రాహ్మణ పురోహిత క్రికెట్ టోర్నమెంట్

కోనసీమ జిల్లాలో అంతరరాష్ట్ర బ్రాహ్మణ పురోహిత క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బ్రాహ్మణుల ఐక్యత కోసం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పూజారులు పంచ కట్టి బ్యాట్ పట్టుకొని గ్రౌండ్లో క్రికెట్ ఆడుతుండటంతో స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.

New Update
Konaseema:  కోనసీమలో అంతరరాష్ట్ర బ్రాహ్మణ పురోహిత క్రికెట్ టోర్నమెంట్

Cricket Tournament: అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం అంబాజీపేటలో అంతరరాష్ట్ర బ్రాహ్మణ పురోహిత క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు. స్థానిక జడ్పీ హైస్కూల్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్నారు. పంచ కట్టుకొని క్రికెట్ ఆడారు బ్రాహ్మణ పురోహితులు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పురోహిత అర్చక బ్రాహ్మణుల ఐక్యత కోసం క్రికెట్ టోర్నమెంట్ పెట్టినట్లు తెలుస్తోంది.

Also Read: చంద్రబాబు, పవన్ పై చెడుగా మాట్లాడే కుక్కల తాట తీస్తా.. బుద్దా వెంకన్న వార్నింగ్

నిత్యం గుళ్ళలో పూజలు వ్రతాలు పెళ్లిళ్లు చేసే పూజారులు పంచ కట్టి బ్యాట్ పట్టుకొని గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్నారు. పంచ కట్టులో క్రికెట్ ఆడటం చూసి స్థానికులతో పాటు స్కూల్ పిల్లలు ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు. రెండు రాష్ట్రాల నుంచి సుమారు 20 టీములు వచ్చినట్లు తెలుస్తోంది. గత పది రోజులుగా ఈ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు. కేడాస్ఫూర్తితో పాటు  ఆటవిడుపుగా ఉండేందుకు అదేవిధంగా బ్రాహ్మణులు పురోహితలో ఐక్యత రావడం కోసం ఈ విధంగా టోర్నమెంట్లు పెడుతున్నామంటున్నారు బ్రాహ్మణులు.

Advertisment
తాజా కథనాలు