Revu Movie : 'రేవు' మూవీ రివ్యూ.. మత్స్యకారుల జీవితాన్ని ఆవిష్కరించిన సినిమా ఎలా ఉందంటే?

హరినాథ్ పులి దర్శకత్వంలో మురళి గింజపల్లి, నవీన్ పారుపల్లి నిర్మాణంలో తెరకెక్కిన 'రేవు' చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మత్స్యకారుల జీవన విధానంపై రూపొందిన ఈ సినిమా ఆడియన్స్ నుంచి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. సినిమాటోగ్రఫీ, ఫస్టాఫ్ బాగుందని టాక్ వినిపిస్తోంది.

Revu Movie : 'రేవు' మూవీ రివ్యూ.. మత్స్యకారుల జీవితాన్ని ఆవిష్కరించిన సినిమా ఎలా ఉందంటే?
New Update

Revu Movie Review : ఇటీవల కాలంలో సినిమాలలో కంటెంట్ ఉంటే చిన్న సినిమాలు కూడా పెద్ద ఎత్తున ప్రేక్షకాదరణ పొందుతున్నాయని ఇప్పటికే ఎన్నో సినిమాలు నిరూపించుకున్నాయి. తాజాగా ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి చిత్రాలలో 'రేవు' సినిమా ఒకటి. డైరెక్టర్ హరినాథ్ పులి దర్శకత్వంలో మురళి గింజపల్లి, నవీన్ పారుపల్లి నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం..

కథ విషయానికొస్తే.. రేవు సినిమా కథ మొత్తం సముద్ర తీర ప్రాంతంలో నివసించే మత్స్యకారుల జీవన విధానం ఎలా ఉంటుందనే నేపథ్యంలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ కథ పాలరేవు అనే గ్రామంలోని ఇద్దరు యువకుల మధ్య ఏర్పడిన పోటీ గురించి దర్శకుడు చూపించారు. పాలరేవులో నివసించే అంకాలు (వంశీ పెండ్యాల) గంగయ్య (అజయ్ ) అనే ఇద్దరు మత్స్యకారుల మధ్య కొనసాగుతుంది. అయితే వీరిద్దరిలో ఎవరు చేపలు బాగా పడతారు అనే పోటీ కూడా ఏర్పడుతుంది ఇలా ఈ పోటీ విషయంలోనే ఇద్దరు మధ్య మనస్పర్ధలు ఏర్పడటం గొడవలకు కూడా దారితీస్తుంది.

Also Read : తేజ సజ్జా బర్త్ డే స్పెషల్.. ‘మిరాయ్’ న్యూ పోస్టర్ అదిరింది

ఇకపోతే ఊహించని విధంగా వీరి జీవితాలలోకి ధనవంతుడైన నాగేసు (ఏపూరి హరీ) రాకతో వీరి జీవితాలలో ఊహించని మలుపులు తిరుగుతాయి. ఇలా నాగేసు రాకతో అక్కడ నివసిస్తున్నటువంటి సామ్రాజ్యం (స్వాతి భీమిరెడ్డి) సాంబశివ (సుమేశ్ మాధవన్) భూషణ్ వంటి వారి జీవితాలలో ఈయన ప్రభావం పడటంతో వారి జీవితాలు మారిపోతాయి మరి వీరి జీవితం పట్ల నాగేశ్వ ప్రభావం ఎలా ఉంది తద్వారా వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనేది ఈ సినిమా కథ.

నటీనటులకు నటన ఎలా ఉందంటే.. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు కూడా వారి పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారని చెప్పాలి. వంశీ చాలా సహజసిద్ధంగా తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. జాలరి పాత్రలో వంశీ ఎంతో అద్భుతంగా నటించడమే కాకుండా డైలాగ్స్ చెప్పడం ఆయన హావభావాలు పలికించడం అద్భుతంగా చేశారు. అజయ్ స్వాతి భీమిరెడ్డి ఇలా మిగిలిన తారాగణం మొత్తం వారి పాత్రలకు వందశాతం న్యాయం చేశారు.

టెక్నికల్ పరంగా చూస్తే.. డైరెక్టర్ హరినాథ్ ఈ సినిమాని ఎంతో అద్భుతంగా ప్రేక్షకుల ముందుకు తీసుకోవచ్చారు. ఇక మొదటి భాగంలో అంకాలు గంగయ్య పాత్రలతో సరదాగా సాగిపోయింది. ఇక సెకండ్ హాఫ్ లో కథ మొత్తం మలుపు తిరుగుతుంది అంతేకాకుండా అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు రిపీట్ అవుతూ వచ్చాయి. ఇక విజువల్స్ బాగున్నాయి. ఎడిటింగ్ కూడా బాగుంది.

విశ్లేషణ విషయానికొస్తే.. ఇప్పటికే ఎన్నో సినిమాలు ఇలా గ్రామీణ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ఈ సినిమా తీర ప్రాంతాలలో ఒక జాలరీ జీవితం ఎలా ఉంటుందనే విషయాలను ఎంతో అద్భుతంగా చూపించారు. ఫస్ట్ హాఫ్ సరదాగా సాగిపోయిన సెకండ్ హాఫ్ లో సినిమా కాస్త బోర్ అనిపిస్తుంది. ఇక ఇందులో మరికొంత కామెడీతో పాటు కథనం కూడా బలంగా ఉండి ఉంటే బాగుండేదని తెలుస్తుంది. మొత్తానికి ఒక అద్భుతమైన కథతో డైరెక్టర్ మంచి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

రేటింగ్: 3/5

#revu-movie-review
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe