Insurance Mis Selling: ఇన్సూరెన్స్ మిస్ సెల్లింగ్.. ప్రభుత్వం సీరియస్.. చర్యలకు రెడీ 

తప్పుగా సమాచారం చెప్పి ఇన్సూరెన్స్ పాలసీలు అంటగట్టే ఏజెంట్ల తీరుకు అడ్డుకట్ట పడనుంది. ఏజెంట్స్ కస్టమర్స్ కి ఏదేదో చెప్పి ఇకపై ఇన్సూరెన్స్ పాలసీలు అంటగట్టకుండా.. వారు కస్టమర్ తో జరిపే సంభాషణను వీడియో, ఆడియో రికార్డింగ్ చేయడం తప్పనిసరి చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. 

New Update
Insurance Policy: ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటున్నారా? ఇలా చేయకపోతే దొరికిపోతారు!

Insurance Mis Selling: ఇన్సూరెన్స్ మిస్‌సెల్లింగ్‌ను ఆపడానికి ప్రభుత్వం పెద్ద చర్యలు తీసుకోవాదానికి సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.  ఇన్సూరెన్స్ చేయించే సమయంలో  ఏజెంట్ - కస్టమర్ మధ్య జరిగే సంభాషణల ఆడియో-వీడియో రికార్డింగ్‌ను ప్రభుత్వం త్వరలో తప్పనిసరి చేస్తుందని చెబుతున్నారు.  ఇన్సూరెన్స్‌ను మిస్ సెల్ చేస్తున్న పరిస్థితిపై  వేల సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో వినియోగదారుల వ్యవహారాల శాఖ ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. వివాదాలను నివారించడానికి, ఇన్సూరెన్స్ కు  సంబంధించిన అన్ని నిబంధనలను క్షుణ్ణంగా వివరించాలని డిపార్ట్‌మెంట్ కోరుతోంది.

ఇన్సూరెన్స్ మిస్ సెల్లింగ్ ఎందుకు జరుగుతుంది? 

Insurance Mis Selling: ఇన్సూరెన్స్ ఏజెంట్ - కస్టమర్ మధ్య సరైన కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల తరచుగా వివాదాలకు ప్రధాన కారణమని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ లేఖలో అభిప్రాయపడ్డారు. ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు  పాలసీలోని సానుకూల అంశాల గురించి మాత్రమే ఏజెంట్ చెప్పారని వినియోగదారులు చాలాసార్లు ఫిర్యాదులు  చేస్తున్నారు. అయితే, ఈ విషయంలో తుది నిర్ణయం ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI)పై ఆధారపడి ఉంటుంది.

Also Read: బీ ఎలర్ట్.. టీవీ ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఖర్చు పెరిగిపోతుంది.. తెలుసా?

ప్రాంతీయ భాషలో డాక్యుమెంట్స్:
Insurance Mis Selling: డాక్యుమెంట్స్  ప్రాంతీయ భాషలో ఉండాలి.  ఎందుకంటే, ఇన్సూరెన్స్ పాలసీలు వాటి నిబంధనలు- షరతులలో తరచుగా అస్పష్టమైన భాషను ఉపయోగిస్తాయని, వాటిని అర్థం చేసుకోవడం వినియోగదారులకు కష్టతరం చేస్తుందని సింగ్ అభిప్రాయపడ్డారు. ఈ సమస్యను పరిష్కరించడానికి, గ్రామీణ ప్రజలకు ఇన్సూరెన్స్ పాలసీలను ప్రాంతీయ భాషలలో సిద్ధం చేయాలని ఆయన ప్రతిపాదించారు.

పాలసీ సమాచారం స్పష్టంగా..
Insurance Mis Selling: పాలసీలో ఏయే సేవలను పొందుపరిచారు?  పాలసీ నుంచి  ఏ సేవలు మినహాయించబడ్డాయో పాలసీ స్పష్టంగా పేర్కొనాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం, పాలసీకి వెలుపల ఉన్న సేవలు క్లెయిమ్‌ల కోసం దరఖాస్తు చేసినప్పుడు ఇన్సూరెన్స్ చేసిన వారికి మాత్రమే ఈ విషయాలు తెలియపరుస్తున్నారు. 

ఆసుపత్రిలో ఉండే సమయాన్ని తగ్గించాలి..
Insurance Mis Selling: హెల్త్ ఇన్సూరెన్స్ లో కూడా మార్పులు చేయాలని జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ చైర్మన్ జస్టిస్ అమరేశ్వర్ ప్రతా సాహి సూచించారు. శస్త్రచికిత్స లేదా చికిత్స కోసం పాలసీదారు కనీసం 24 గంటలపాటు ఆసుపత్రిలో ఉండాలనే నిబంధనను పునఃపరిశీలించి మార్పులు చేయాలని ఆయన సూచించారు. ఆయన చెబుతున్న దాని ప్రకారం, ఆసుపత్రిలో ఉండే సమయాన్ని తగ్గించవచ్చు.

Watch this interesting Video:

Advertisment
Advertisment
తాజా కథనాలు