Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో అదిరిపోయే ఫీచర్.. రీల్స్ ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా.. 

ఇన్‌స్టాగ్రామ్ లో రీల్స్ లేదా షార్ట్ వీడియోలను నేరుగా డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం ఇప్పటివరకూ లేదు. దీంతో థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా ఆ పని చేస్తున్నారు. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ డౌన్‌లోడ్ చేయడం కోసం ఒక ఫీచర్ తీసుకువచ్చింది. దీంతో  ఈజీగా రీల్స్ డౌన్‌లోడ్  అవుతాయి 

New Update
Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో అదిరిపోయే ఫీచర్.. రీల్స్ ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా.. 

Instagram: సోషల్ మీడియాలో మంచి ఆదరణ ఉన్న ఇన్‌స్టాగ్రామ్ మరో కొత్త ఫీచర్ తీసుకువచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ లో షార్ట్ వీడియోలు, రీల్స్ బాగా ప్రాచుర్యం పొందాయి. ఇప్పటివరకూ ఈ వీడియోలను ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్ ఫామ్ పై చూడటం తప్ప వాటిని డౌన్‌లోడ్చేసుకునే అవకాశం లేదు. ఇది వినియోగదారులకు ఇబ్బందిగా ఉండేది. ఇలా డౌన్‌లోడ్చేసుకోవడానికి థర్డ్ పార్టీ యాప్స్ ను ఉపయోగిస్తుండేవారు. ఇప్పుడు వినియోగదారుల కోసం ఇన్‌స్టాగ్రామ్ ఆ వీడియోలను డౌన్‌లోడ్చేసుకునే అవకాశం కల్పించింది. 

షార్ట్ వీడియో -ఇమేజ్ షేరింగ్ ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్(Instagram) ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులందరికీ రీల్స్ డౌన్‌లోడ్ ఫీచర్‌ను విడుదల చేయడం ప్రారంభించింది. ఈ ఫీచర్ ద్వారా, వినియోగదారులు థర్డ్ పార్టీ యాప్‌లను ఉపయోగించకుండా రీల్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోగలరు.

ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మొస్సేరి ‘’'ఇప్పుడు మీరు ఏదైనా పబ్లిక్ ఎకౌంట్ రీల్‌ను సేవ్ చేయవచ్చు. డౌన్‌లోడ్ చేసిన రీల్‌లో దాన్ని సృష్టించిన హ్యాండిల్ వాటర్‌మార్క్ కనిపిస్తుంది.’’ అని చెప్పారు. 

Also Read:  ఆ గోల్డ్ బాండ్ మొదటి సిరీస్ మెచ్యూరిటీ…లాభం ఎంతో తెలిస్తే అదిరిపోతారు!

ఐదు నెలల క్రితం, కంపెనీ ఈ ఫీచర్‌ను అమెరికాలో మాత్రమే అందుబాటులోకి తెచ్చింది.  ఇది త్వరలో భారతదేశంతో సహా ఇతర దేశాలలో అందుబాటులోకి రానుంది.

యూజర్లు రీల్స్ డౌన్‌లోడ్ ఫీచర్‌ను డిసేబుల్ చేయగలుగుతారు.

అయితే, ప్రైవేట్ ఖాతాల ద్వారా షేర్ చేసిన రీల్స్‌ను డౌన్‌లోడ్ చేయడం సాధ్యం కాదని ఆడమ్ మోస్సేరి తెలిపారు. అదే సమయంలో, పబ్లిక్ ఖాతాలను కలిగి ఉన్న వినియోగదారులు ఖాతా సెట్టింగ్‌ల నుంచి రీల్స్‌ను డౌన్‌లోడ్ చేసే ఫీచర్ ను ఆఫ్ చేయవచ్చు, దీని కారణంగా రీల్స్ డౌన్‌లోడ్ ఆప్షన్ కనిపించదు. అంటే రీల్ లేదా వీడియో అప్ లోడ్ చేసిన వారి ఇష్టం లేకుండా ఎవరూ రీల్స్ ను కానీ వీడియోలను కానీ డౌన్‌లోడ్చేయలేరు. 

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను డౌన్‌లోడ్ ఇలా.. 

  • మొదటగా  మీరు డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్న రీల్‌ను తెరవండి.
  • ఇప్పుడు యాప్ కుడివైపున ఉన్న షేర్ ఐకాన్‌పై నొక్కండి.
  • ఇప్పుడు కాపీ లింక్ ఆప్షన్ పక్కన డౌన్‌లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది.
  • డౌన్‌లోడ్ ఆప్షన్‌పై నొక్కడం ద్వారా మీరు రీల్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ప్రస్తుతం, వినియోగదారులు థర్డ్ పార్టీ యాప్‌లు లేదా హిడెన్  ట్రిక్‌ల ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ను డౌన్‌లోడ్ చేస్తున్నారు. ఇది కాకుండా, రీల్స్‌ను డౌన్‌లోడ్ చేయడానికి, వినియోగదారులు మొదట దాన్ని వారి స్టోరీలో సెట్ చేస్తారు.  ఆ తర్వాత వారు స్టోరీని డౌన్‌లోడ్ చేసి, అక్కడి నుండి రీల్స్‌ను డౌన్‌లోడ్ చేసుకునే ఆప్షన్ ఉంది. ఇప్పుడు నేరుగానే రీల్స్ డౌన్‌లోడ్చేసుకునే సదుపాయం తీసుకు వచ్చింది ఇన్‌స్టాగ్రామ్. 

Watch this interesting Video:

Advertisment
తాజా కథనాలు