/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/biscuit.jpg)
Ap: ఈ మధ్య కాలంలో తినడానికి ఏ పదార్థం తీసుకోవాలన్న భయపడాల్సి వస్తుంది. ఎందుకంటే అన్నీంట్లోనూ కల్తీ కనిపిస్తుంది. ఒకవేళ చూడటానికి బాగున్న తిన్న తరువాత ఏది ఏలా ఎఫెక్ట్ చూపిస్తోందో చెప్పలేం. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా పరిస్థితులు ఏ మాత్రం మారడం లేదు.
Also Read: కట్టెల కోసం వెళ్లిన మహిళ తలను తిన్న పులి.. ఏపీలో దారుణ ఘటన!
తాజాగా, కర్నూలు - ఆదోనిలో ఓ చిన్నారికి హైడ్ అండ్ సీక్ బిస్కెట్ తినిపిద్దామనుకున్నారు తల్లిదండ్రులు. అయితే, వారు బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ చేయగా షాక్ కు గురైయ్యారు. హైడ్ అండ్ సీక్ బిస్కెట్ ప్యాకెట్లో పురుగులు బయటపడ్డాయి. కంగుతిన్న తల్లిదండ్రులు వెంటనే ప్యాకెట్లను కిందపడేశారు. అధికారులు ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.