Food Safety: ఇలా చేస్తే పిండికి పురుగు అస్సలు పట్టదు.. మీరు కూడా ట్రై చేయండి!

పిండికి పురుగు పట్టకుండా పొడిపిండిని బాగా ఎండలో ఆరబెట్టుకోవాలి. అలా చేస్తే అందులోని చిన్న పురుగులు బయటికి వచ్చేస్తాయి. ఆ పిండిని గాలి చొరబడని బ్యాగులు లేదా, కంటైనర్లలో పెట్టి ఫ్రీజర్‌లో పెట్టినట్లయితే దానికి పురుగులు పట్టవు.

Food Safety: ఇలా చేస్తే పిండికి పురుగు అస్సలు పట్టదు.. మీరు కూడా ట్రై చేయండి!
New Update

చాలా మంది రోజూ ఇంట్లో ఏవోక స్నాక్స్‌ చేసుకుంటూ ఉంటారు. దానికి సరిపడా శెనగపిండి, జొన్న, గోధుమ, మైదా పిండిని ఇంట్లోనే ముందుగా పట్టించుకుని నిల్వ చేసుకుంటూ ఉంటారు. అయితే.. పెద్ద మొత్తంలో పిండిని ఇంట్లో నిల్వ చేసుకోవడం వల్ల అందులో పురుగులు పడుతూ ఉంటాయి. పిండి మొత్తం పాడవుతూ ఉంటుంది. చివరికి వృధాగా పడేస్తుంటారు. కొందరు అయితే ఆ పిండిని నానా తంటాలు పడి శుభ్రం చేసుకుని వాడుకుంటారు. పిండికి పురుగు పట్టకుండా కొన్ని టిప్స్‌ను ఫాలో అయితే ఏ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఆ టిప్స్‌ ఏంటో తెలుసుకుందాం..

బిర్యానీ ఆకులను వేసి నిల్వ చేసుకుంటే..

పిండికి పురుగు పట్టకుండా పొడిపిండిని బాగా ఎండలో ఆరబెట్టుకోవాలి. అలా చేస్తే అందులోని చిన్న పురుగులు బయటికి వచ్చేస్తాయి. ఆ పిండిని గాలి చొరబడని బ్యాగులు లేదా, కంటైనర్లలో పెట్టి ఫ్రీజర్‌లో పెట్టినట్లయితే దానికి పురుగులు పట్టవు. ఒకవేళ చిన్నచిన్న పురుగులు ఉన్నా ఫ్రీజర్‌లోని చల్లదనానికి అవి చనిపోతాయి. బయట ఉన్న పిండిలో కొన్ని లవంగాలుతో పాటు బిర్యానీ ఆకులను వేసి నిల్వ చేసుకుంటే ఆ వాసనకు పురుగులు దరిచేరవని అంటున్నారు.

ఇది కూడా చదవండి: ఇలా ఉంటేనే అమ్మాయిలు ప్రేమిస్తారట

అలాగే.. ఎక్కువ మొత్తంలో పిండిని స్టోర్‌ చేసుకోకుండా ఎప్పటికప్పుడు మితంగా తెచ్చుకుంటేనే బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. పిండిని ఉంచే అలమరను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని, తేమ కూడా దరిచేరకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. పిండి ఉన్న పరిసర ప్రాంతాల్లో కూడా లక్ష్మణరేఖ వంటివి రాయాలని అంటున్నారు. ఇలా చేస్తే ఏ పిండి అయినా సరే ఎక్కువ రోజుల పాటు తాజాగా ఉంటుందని నిపుణులు సలహా ఇస్తున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.

WATCH:

#life-style
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe