ఇది కదా మెగా ఫ్యాన్స్ అంటే.. చిరంజీవికి వినూత్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ప్రముఖుల నుంచి అభిమానుల వరకు అందరూ అన్నయ్యకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే కొంత మంది అభిమానులు చిరు మీద ఉన్న తమ అభిమానాన్ని వినూత్నంగా చాటుకుంటున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో మెగా ఫ్యాన్స్ బర్త్‌డే విషెస్ తెలియజేసిన వీడియో విపరీతంగా ఆకట్టుకుంటుంది.

New Update
ఇది కదా మెగా ఫ్యాన్స్ అంటే.. చిరంజీవికి వినూత్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ప్రముఖుల నుంచి అభిమానుల వరకు అందరూ అన్నయ్యకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే జోగులాంబ గద్వాల జిల్లాలో చిరుకు మెగా ఫ్యాన్స్ బర్త్‌డే విషెస్ చెప్పిన వీడియో విపరీతంగా ఆకట్టుకుంటుంది. అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు రావణం స్వామినాయుడు, తెలంగాణ రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షులు వెంకటేష్ ఆదేశాలతో జోగులాంబ గద్వాల జిల్లా మెగా ఫ్యాన్స్ అధ్యక్షుడు బోయ జమ్మన్న చిరంజీవికీ వినూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. డస్ట్, రంగులతో మెగాస్టార్, పవర్ స్టార్ చిత్రం వేశారు.

గద్వాల జిల్లా కేంద్రంలోని రాయచూరు రోడ్డు నోబుల్ హైస్కూల్ సమీపంలోని బోయ జమ్మన్న ఆధ్వర్వంలో పొలంలో రెండు యూనిట్ల డస్టు, ప్రత్యేక రంగులతో దాదాపు 400 ఫీట్లు పొడవు, 250 ఫీట్ల వెడల్పుతో వారాహి వాహనంపై నిల్చొని ప్రజలకు అభివాదం చేస్తున్న చిరంజీవి, పవన్ కళ్యాణ్ చిత్రాలను తీర్చిదిద్దారు. ఈ సందర్బంగా నేలపై రూపొందించిన మెగాస్టార్, పవర్ స్టార్ భారీ చిత్రాలను వీక్షించిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవికి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రతి సంవత్సరం ఏదో విధంగా చిరంజీవి జన్మదినం రోజు ఒక ప్రత్యేకత చాటుకునేలా కార్యక్రమాలు చేపడుతున్నామని జమ్మన్న తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరోవైపు చిరంజీవికి ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, రాంచరణ్‌తో పాటు మెగా హీరోలందరూ విషెస్ తెలియజేశారు. వీరితో పాటు సీనియర్ హీరోలు వెంకటేశ్,బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, డైరెక్టర్లు పూరి జగన్నాథ్, హరీశ్ శంకర్, అనిల్ రావిపూడి, సంపత్ నంది, బాబి,  నటుడు హైపర్ ఆది, తేజ సజ్జా వీష్ చేశారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ, యువనేత నారా లోకేష్ కూడా శుభాకాంక్షలు తెలిపారు.

సినీ పరిశ్రమలోకి సామాన్య నటుడిగా కెరీర్ ప్రారంభించినా ఆయన తనకు తానుగా అత్యున్నత శిఖరాలను చేరుకున్నారు. తన కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలను చిత్రపరిశ్రమకు పరిచయం చేశారు. మెగాహీరలే కాకుండా పరిశ్రమలో ఎంతోమంది హీరోలకు ఇన్ స్పిరేషన్ గా నిలిచారు మెగాస్టార్. కోట్లాది మంది గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని దక్కించుకుని మెగాస్టార్ అయ్యారు. అగ్రకథానాయకుడిగా..బాక్సాఫీసును శాసించిన ఈ సుదీర్ఘ ప్రయాణంలో మెగాస్టార్ చిరంజీవి నేర్చున్న పాఠాలెన్నో. తాను నేర్చుకున్న ప్రతిపాఠాన్ని విజయవంతంగా మార్చుకుంటూ తనకు తానుగా మెగా హిట్స్ తో ఎవరూ అందుకోని స్థాయికి చేరుకున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు