Indigo Market Cap: ఇండిగో మార్కెట్ క్యాప్ పెరిగింది.. ఇప్పుడు ప్రపంచంలో ఇండిగో స్థానం ఎంతంటే.. 

ఇటీవల స్టాక్ మార్కెట్ బుల్లిష్ గా ఉంది. దీంతో చాలా కంపెనీల షేర్ల ధరలు పెరుగుతూ వస్తున్నాయి. అలా ఇండిగో విమాన సంస్థ షేర్లలో కూడా బలమైన పెరుగుదల వచ్చింది. దీంతో ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ బాగా పెరిగింది. ఇప్పుడు మార్కెట్ క్యాప్ లో ఇండిగో ప్రపంచంలోనే 6వ స్థానానికి చేరుకుంది 

New Update
Indigo : ప్రపంచంలోనే మూడో అతిపెద్ద విమాన సంస్థగా ఇండిగో 

Indigo Market Cap: మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం, ఇండిగో డిసెంబర్ 13న ప్రపంచంలో 6వ అతిపెద్ద విమానయాన సంస్థగా అవతరించింది. ఇండిగో అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌ను వెనక్కి నెట్టింది. ఎయిర్‌లైన్స్ మాతృ సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ స్టాక్‌ వరుసగా 12 రోజుల పాటు నిరంతరంగా పెరగడం వల్ల ర్యాంకింగ్‌లో ఈ జంప్ వచ్చింది.  బుధవారం ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ స్టాక్ రూ.58.55 పెరిగి రూ.2,985 స్థాయిలో ముగిసింది. ఈ పెరుగుదలతో, ఇంటర్‌గ్లోబ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ₹1.15 లక్షల కోట్లకు చేరుకుంది, ఇది దాదాపు $13.8 బిలియన్లు. కాగా, యునైటెడ్ ఎయిర్‌లైన్స్ మార్కెట్ క్యాప్ ప్రస్తుతం $13.5 బిలియన్లు అంటే ₹ 1.12 లక్షల కోట్లు.

తొలిసారిగా ఇండిగో (Indigo Market Cap)షేరు వరుసగా 12 ట్రేడింగ్ రోజుల పాటు పెరిగింది. 2015లో లిస్టింగ్ అయిన తర్వాత తొలిసారిగా, ఇండిగో స్టాక్ వరుసగా 12 ట్రేడింగ్ రోజులలో పెరుగుదలను చూసింది. నవంబర్ 28 నుంచి ఈ స్టాక్ లో ర్యాలీ ప్రారంభం అయింది. అప్పటి నుంచి స్టాక్ 16% రాబడిని ఇచ్చింది. అంతకుముందు 2021లో, ఆగస్ట్ 23 నుచి  వరుసగా 11 ట్రేడింగ్ రోజుల పాటు ధరలు పెరిగాయి. అయితే, గత ర్యాలీలో, స్టాక్ హోల్డర్లకు 19% రాబడి వచ్చింది.

Also Read: బంగారం కొనాలంటే బీ రెడీ.. మళ్ళీ తగ్గిన బంగారం.. వెండి ధరలు ఢమాల్.. 

ముడి చమురు ధరల తగ్గుదల కారణంగా.. :
మీడియా రిపోర్ట్స్  ప్రకారం, ముడి చమురు ధరలు తగ్గడం - దేశీయ విమానయాన రంగం నుంచి మంచి డిమాండ్ కారణంగా కంపెనీ స్టాక్ విలువ పెరుగుతూ వస్తోంది. ఇండిగో(Indigo Market Cap) క్యూ2ఎఫ్‌వై24లో ₹ 189 కోట్ల లాభాన్ని ఆర్జించింది. 2023-24 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (జూలై-సెప్టెంబర్) ఇండిగో ₹ 188.9 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఒక నెల క్రితం, Q2FY24 ఫలితాలను విడుదల చేస్తూ కంపెనీ ఈ సమాచారాన్ని ఇచ్చింది.

ఏ ఆర్థిక సంవత్సరం లోనైనా సరే.. రెండో త్రైమాసికంలో ఏవియేషన్ కంపెనీ లాభాలను ఆర్జించడం ఐదేళ్లలో ఇదే తొలిసారి. సాధారణంగా ఈ త్రైమాసికం ఏవియేషన్ పరిశ్రమకు బలహీనమైన డిమాండ్ ఉన్న సీజన్‌గా చెబుతారు. ఇటువంటి సీజన్ లో కూడా ఇండిగో లాభాలు సాధించడం గమనార్హం.   

Watch this interesting Video:

Advertisment
Advertisment
తాజా కథనాలు