టీమ్ ఇండియాకు ఎదురుదెబ్బ...ఆడుతూ పాడుతూ గెలిచిన వెస్టిండీస్..!!

రెండో వన్డేలో వెస్టిండీస్ చేతుల్లో భారత్ చిత్తుగా ఓడింది. 1-1తేడాతో వన్డే సిరీస్‌ను వెస్టిండీస్ సమం చేసింది. శార్థూల్ ఠాకూర్ 3వికెట్లతో రాణించినా ఫలితం లేకపోయింది. 2023 ప్రపంచకప్‌ దగ్గర పడతున్న వేళ..టీమిండియా నుంచి ఇలాంటి ప్రదర్శన రావడం ఫ్యాన్స్‌ని షాక్‌కి గురి చేసింది.

టీమ్ ఇండియాకు ఎదురుదెబ్బ...ఆడుతూ పాడుతూ గెలిచిన వెస్టిండీస్..!!
New Update

వెస్టిండీస్‌పై టెస్టు సిరీస్‌ గెలిచిన భారత్ జట్టుకు రెండో వన్డేలో ఊహించని షాక్ తగిలింది. సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత శర్మ లేకుండా బరిలో దిగిన భారత జట్టు, వెస్టిండీస్‌పై ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. 6వికెట్ల తేడాతో భారత్ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. దీంతో వన్డే సిరీస్ 1-1తో సమం అయ్యింది. ఆగస్టు 1 జరిగే ఆఖరి వన్డే , సిరీస్ విజేతను నిర్ణయించనుంది.

చివరిదైన మూడో వన్డే టరౌబాలో జరగనుంది. ప్రపంచకప్ 2023కి ముందు, భారత బ్యాటర్లు ఇలా ఫ్లాప్ కావడం జట్టు మేనేజ్‌మెంట్‌కు ఆందోళన కలిగించే విషయం. రెండో వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్లేయింగ్ ఎలెవన్‌లో లేరు. వారి గైర్హాజరీలో సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, సంజూ శాంసన్‌లు బ్యాటింగ్‌కు దిగారు. తొలి వన్డేలో కూడా సూర్య, పాండ్యా రాణించింది లేదు.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 40.5 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు ఇషాన్ కిషన్ 55 బంతుల్లో 55 పరుగులు చేశాడు. శుభ్‌మన్ గిల్ 49 బంతుల్లో 34 పరుగులు చేశాడు. వారి తర్వాత బ్యాటర్లు హ్యాండ్‌ ఇచ్చేశారు. సంజూ శాంసన్ చాలా కాలం తర్వాత ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తిరిగి వచ్చినా తీవ్రంగా నిరాశ పరిచాడు. 19 బంతుల్లో 9 పరుగులు చేసి ఔటయ్యాడు. అక్షర్ పటేల్ ఒక పరుగు చేసి అవుటయ్యాడు. హార్దిక్ పాండ్యా 7 పరుగులు చేసి వెనుతిరిగాడు.

సూర్యకుమార్ యాదవ్ 25 బంతుల్లో 24 పరుగులు చేసి ఔటయ్యాడు. 10 పరుగుల వద్ద రవీంద్ర జడేజా పెవిలియన్‌కు చేరుకున్నాడు. శార్దూల్ ఠాకూర్ 16 పరుగులు చేశాడు. ఇక ఛేదనలో విండీస్ కు ఓపెనర్లు మంచి ఆరంభానిచ్చారు. తొలి వికెట్‌కు బ్రాండన్ కింగ్ (15), కైల్ మేయర్స్ (36) 53 పరుగులు జోడించారు.
అయితే తర్వాత విండీస్‌ ఒక్కసారిగా నాలుగు వికెట్లు కోల్పోయింది. 91 పరుగులకే 4 వికెట్లను కోల్పోయిన విండీస్‌ను కెప్టెన్ హోప్, కార్టీలు జట్టును ఆదుకున్నారు. మరో వికెట్ పడకుండా కావాల్సిన మరో 91 పరుగులు జోడించి విండీస్‌ను గెలిపించారు.

ఇక వెస్టిండీస్‌తో ఆడిన తొలి వన్డేలో కూడా భారత బ్యాటర్లు సరిగ్గా ఆడలేదు. ఈ మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించినా ప్రధాన బ్యాటర్లు విఫలమయ్యారు. ఆ మ్యాచ్‌లో గిల్ 7 పరుగులు చేసి ఔటయ్యాడు. సూర్య కేవలం 19 పరుగులు చేసి ఔటయ్యాడు. హార్దిక్ పాండ్యా రనౌట్ అయ్యాడు. జడేజా 16 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. శార్దూల్ ఠాకూర్ 1 పరుగుతో అవుటయ్యాడు. రోహిత్, కోహ్లి లేకపోయినా టీమిండియా బ్యాటింగ్ పేలవంగా కనిపించింది. 2023 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని భారత జట్టు సిద్ధమవుతోంది. అయితే అంతకు ముందు బ్యాటింగ్‌లో ఫ్లాప్ కావడం నిరాశపరిచింది.

#hardik-pandya #west-indies-vs-india #indvswi-2nd-odi
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి