Fraudsters: కోటి రూపాయలు ఇస్తామన్నారు.. ఫేస్‌బుక్‌ అడ్డాగా పెరిగిపోతున్న కిడ్నీ రాకెట్ బాధితులు..!

చెన్నైలోని సూర్య అనే మహిళకు కిడ్నీ అమ్మితే కోటి రూపాయలు ఇస్తామని ఓ ఫేక్‌ డాక్టర్‌ కాల్ చేశాడు. పెరిగిపోయిన అప్పులు కట్టడానికి కిడ్నీ అమ్మేందుకు నిర్ణయించుకున్న సూర్య అతని మాటలు మొదట నమ్మంది. తర్వాత డోనార్‌ కార్డ్‌కి రూ.5లక్షలు కట్టమనడంతో అనుమానం వచ్చిన సూర్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.

New Update
Fraudsters: కోటి రూపాయలు ఇస్తామన్నారు.. ఫేస్‌బుక్‌ అడ్డాగా పెరిగిపోతున్న కిడ్నీ రాకెట్ బాధితులు..!

అప్పటివరకు జాబ్‌ చేస్తూ కుటుంబాన్ని పెంచి పోషిస్తున్న సూర్య అనే మహిళ యాక్సిడెంట్‌తో ఉద్యోగాన్ని కోల్పోయింది. చెన్నైకి చెందిన సూర్య 2020ఫిబ్రవరీలో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆ తర్వాత నెల రోజులకే కరోనా లాక్‌డౌన్‌ విధించడంతో ఆమె కుటుంబానికి తిండి కూడా కరవైంది. ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితి.. బతకడం కోసం తన కుటుంబాన్ని బతికించడం కోసం తెలిసిన వాళ్ల దగ్గర అప్పులు చేస్తూ వచ్చింది. అలా ఆ అప్పుల సంఖ్య 5లక్షలు దాటింది. తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వమని ఒత్తిడి చేసేవాళ్లు పెరిగిపోయారు. ఈ ఒత్తిడిని తట్టుకోలేక పోయిన సూర్య తన కిడ్నీ అమ్మేందుకు నిర్ణయించుకుంది. నిజానికి ఇండియాలో కిడ్నీ అమ్మడం, కొనడం నేరం..అయితే గత్యంతరం లేక అదే చేయాలని డిసైడ్ అయ్యింది. మరి తర్వాత ఏం జరిగింది.. సుర్యా కిడ్నీ అమ్మిందా..? మోసపోయిందా..?

publive-image ప్రతికాత్మక చిత్రం

ఆన్‌లైన్‌లో సెర్చింగ్‌:
కిడ్నీ అమ్మాలని గట్టిగా నిర్ణయించుకున్న సూర్య.. ఆన్‌లైన్‌లో గూగుల్‌ సెర్చ్‌ చేసింది. కొన్ని చోట్లా నంబర్లు కనిపించాయి.. వాటిని సేవ్‌ చేసుకుంటూనే ఫేస్‌బుక్‌లోనూ వెతకడం మొదలుపెట్టింది. కిడ్నీకి సంబంధించి ఓ గ్రూప్‌ ఉంటే అందులో తన పేరు, ఫోన్‌ నంబర్‌ పెట్టింది. ఆమె అలా పెట్టిన కొన్ని నిమిషాలకే ఓ వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. ఘజియాబాద్‌లోని గిత్రో మెడికల్ సెంటర్ నుంచి కాల్ చేస్తున్నానని..తన పేరు శాండీ అని..తానోక డాక్టర్‌ని అంటూ పరిచయం చేసుకున్నాడు. తమ ఆస్పత్రిలో కిడ్నీ అవసరమున్న రోగి ఉన్నాడని చెప్పాడు. కిడ్నీ ఇస్తే కోటి రూపాయలు ఇస్తానంటూ నమ్మబలికాడు. చెప్పిన అమౌంట్ చూసి ఆశ్చర్యపోయిన సూర్య ఆ డబ్బుకు తనకు వస్తే లైఫ్‌లో ఎలాంటి సమస్యా ఉండదని.. అప్పులు తీరిపోవడమే కాకుండా..ఫ్యూచర్‌లో కూడా మనీ రిలెటెడ్‌ ప్రాబ్లెమ్స్‌ రావని భావించింది. కిడ్నీ అమ్మేందుకు ఒప్పుకుంది.

డబ్బులు కట్టాలంటూ ఒత్తిడి:
కిడ్నీ అమ్మేందుకు అంగీకరించిన సూర్య తర్వాత తానేం చేయాలో అడిగింది. అసలేం చేయాల్సిన పని లేదు అని తర్వాత కాల్ చేస్తానంటూ శాండీ ఫోన్ పెట్టేశాడు. కొన్ని రోజులకు సూర్యకు కాల్‌ వచ్చింది. డోనార్‌ కార్డ్ తీసుకోవాలని.. అందుకు 5లక్షలు చెల్లించాలని శాండీ చెప్పాడు. సరేనన్న సూర్య కాల్‌ కట్ చేసిన తర్వాత కాసేపు ఆలోచించింది. ముందు డబ్బులు కట్టాలని శాండీ చెప్పడంతో ఆమెకు డౌట్ వచ్చింది. డోనార్‌ కార్డ్‌ గురించి ఇంటర్నెట్‌లో సెర్చ్‌ చేసింది. ఈ క్రమంలో మోహన్ ఫౌండేషన్ (మల్టీ ఆర్గాన్ హార్వెస్టింగ్ ఎయిడ్ నెట్‌వర్క్) నంబర్‌ను చూసింది. వాళ్లకి కాల్ చేసింది. ఎవరికీ డబ్బులు కట్టదని చెప్పడంతో నేరుగా వెళ్లి ఫౌండేషన్‌ పెద్దలను కలిసింది. అసలు విషయాన్ని తెలుసుకోని షాక్‌ అయ్యింది. అసలు డోనార్‌ కార్డ్‌ ఫ్రీగా ఇస్తారు. రూపాయ్‌ కూడా ఛార్జ్‌ చేయరు. దీంతో ఆమెకు అసలు విషయం బోధ పడింది. మోసపోవడానికి బౌండరీ ఎడ్జ్‌ వరకు వచ్చినట్టు తెలుసుకుంది.

పోలీసులకు ఫిర్యాదు:
ఫౌండేషన్‌ ద్వారా నిజం తెలుసుకున్న సూర్యా పోలీసులను ఆశ్రయించింది. అటు ఆమెకు మరో ఇద్దరు బాధితులు జత కలిశారు. వాళ్లిద్దరు మోసపోయిన వాళ్లు. డోనార్‌ కార్డ్‌కి డబ్బులు కట్టిన తర్వాత ఫోన్‌ నంబర్లు కలవకపోవడంతో మోసపోయినట్టు గ్రహించిన వాళ్లు. ఈ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇప్పుడు సూర్య ప్రయత్నిస్తోంది. మరోవైపు దేశవ్యాప్తంగా ఇలాంటి మోసాలు తరుచుగా జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. ముఖ్యంగా ఫేస్‌బుక్‌ అడ్డాగా కిడ్నీ రాకెట్‌ మిడిల్‌క్లాస్‌ ప్రజలను మభ్యపెడుతుందని పోలీస్‌స్టేషన్‌లలో నమోదవుతున్న కేసులు చూస్తే అర్థమవుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లోనూ నిత్యం ఏదో ఒక చోటా ఈ తరహా ఘటనలు వెలుగుచూస్తున్నాయి. కిడ్నీ అమ్మడం నేరం.. కొనడం కూడా నేరం..బీ కేర్‌ఫుల్..!

Advertisment
Advertisment
తాజా కథనాలు