Hamas Attack: హమాస్ టెర్రరిస్టుల ఘాతుకం.. ప్రముఖ నటి సోదరి, బావ హతం..

ప్రముఖ టీవీ నటి మధురా నాయక్‌ తన కజిన్‌ సోదరిని, ఆమె భర్తను పాలస్తీనా ఉగ్రవాదులు హమాస్‌ దాడిలో దారుణంగా హత్య చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమే వెల్లడించింది. మధుర తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ దాడికి సంబంధించిన హృదయ విదారకమైన విషయాలను పంచుకుంది. ఈ వ్యవహారం ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇజ్రాయెల్‌లో తమ పిల్లల కళ్లు ముందే.. ఆ ఇద్దరినీ చంపేశారని కన్నీరుమున్నీరయ్యింది నటి.

New Update
Hamas Attack: హమాస్ టెర్రరిస్టుల ఘాతుకం.. ప్రముఖ నటి సోదరి, బావ హతం..

TV Actress Madhura Naik: ప్రముఖ టీవీ నటి మధురా నాయక్‌ తన కజిన్‌ సోదరిని, ఆమె భర్తను పాలస్తీనా ఉగ్రవాదులు హమాస్‌ దాడిలో దారుణంగా హత్య చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమే వెల్లడించింది. మధుర తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ దాడికి సంబంధించిన హృదయ విదారకమైన విషయాలను పంచుకుంది. ఈ వ్యవహారం ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇజ్రాయెల్‌లో తమ పిల్లల కళ్లు ముందే.. ఆ ఇద్దరినీ చంపేశారని కన్నీరుమున్నీరయ్యింది నటి.

‘ఉగ్రదాడిలో మా కజిన్ సిస్టర్, ఆమె భర్తను కోల్పోయారు. వారి ఆప్యాయత, దయ, ప్రేమ ఎల్లప్పుడూ గుర్తుకుంటాను. వీరితో పాటు.. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారందరకి అంజలి ఘటిస్తున్నాయి. వారి ఆత్మ శాంతించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఈ కష్ట కాలంలో మాకు, ఇజ్రాయెల్ ప్రజలకు అండగా నిలబడండి. ఉగ్రవాదుల అరాచకాలు ఎంత దుర్మార్గంగా ఉంటాయో, అమానవీయంగా ఉంటా ప్రజలు గుర్తించాల్సిన సమయం ఇది.’ అని పేర్కొంది.

అంతేకాదు.. ఇజ్రాయెల్‌ను కోల్డ్ బ్లడెడ్ కిల్లర్స్‌గా చూపే ఈ పాలస్తీనా అనుకూల అరబ్ దేశాల ప్రచారం ఏమాత్రం నిజం కాదని నటి సోషల్ మీడియా వేదికగా పేర్కొంది. ఇదిలాఉంటే.. ఇజ్రాయెల్, హమాస్ మధ్య పోరు భీకరంగా కొనసాగుతోంది. ఇజ్రాయెల్ గజాపై భీకర దాడులు చేస్తోంది. ఉగ్రవాదులను ఏరిపారేస్తోంది.

Also Read:

TS elections 2023: బాబోయ్.. ఎన్నికల వేళ రోడ్లపైకి నోట్ల కట్టలు.. ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు..!

Nara Lokesh CID: ముగిసిన నారా లోకేష్ సీఐడీ విచారణ

Advertisment
Advertisment
తాజా కథనాలు