IT Jobs: ఐటీ ఉద్యోగులకు షాక్.. ఈ ఏడాది వారి జాబ్స్ అన్నీ ఔట్!

గతేడాదితో పోలిస్తే ఈ ఏడాదే కంపెనీలు ఎక్కువ మంది ఉద్యోగులకు బైబై చెప్పాయి. గతేడాది రోజుకు 40 మంది ఉద్యోగాలు కోల్పోగా.. ఈ ఏడాది రోజుకి 49 మంది వరకు ఉద్వాసన పలికారు. ఈ ఏడాది ఉద్యోగాలు కోల్పోయిన వారిలో 60 శాతం మంది బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న వారే అని ఓ సర్వే తెలిపింది.

IT Jobs: ఐటీ ఉద్యోగులకు షాక్.. ఈ ఏడాది వారి జాబ్స్ అన్నీ ఔట్!
New Update

కరోనా సమయం నుంచి టెక్‌ కంపెనీలు అన్ని తమ సంస్థల్లో పని చేసే ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. తమ కంపెనీ ఆర్థిక స్థితి గతులను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలకు పాల్పడుతున్నట్లు ప్రముఖ కంపెనీలు అయిన గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ వంటివే తెలిపాయి.

అయితే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాదే కంపెనీలు ఎక్కువ మంది ఉద్యోగులకు బైబై చెప్పాయి. గతేడాది రోజుకు 40 మంది ఉద్యోగాలు కోల్పోగా.. ఈ ఏడాది రోజుకి 49 మంది వరకు ఉద్వాసన పలికారు. ఈ ఏడాది ఉద్యోగాలు కోల్పోయిన వారిలో 60 శాతం మంది బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న వారే అని ఓ సర్వే తెలిపింది.

Also read: దసరా రోజు జమ్మి చెట్టుని ఎందుకు పూజిస్తారు…పాలపిట్టను ఎందుకు చూడాలి!

కరోనా ముగిసిన తరువాత అంత సర్దుకుంటుంది అనుకుంటున్న తరుణంలో స్టార్ట్‌ కంపెనీలకు నిధుల సమస్య తీవ్రంగా మారింది. ఈ సంవత్సరం గడిచిన 9 నెలల కాలంలో సుమారు 13, 978 మంది ఉద్యోగులను తొలగించినట్లు అధికారులు తెలిపారు.

గతేడాది ఈ ఉద్యోగుల సంఖ్య 8,740 మందిగా ఉంది. ఈ ఏడాది ఉద్యోగులను తొలగించిన కంపెనీల జాబితాలో లింక్డిన్‌ కూడా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 700 మందిని ఈ కంపెనీ తీసివేసింది. అత్యధికంగా అమెరికాలో ఉద్యోగుల తొలగింపులు నమోదు అయ్యాయి.

అమెరికాలోనే ఈ ఏడాది 70 శాతం మంది తొలగింపులు నమోదు అయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో భారత్‌, జర్మనీ, స్వీడన్‌, యూకే, నెదర్లాండ్స్‌, కెనడా కూడా ఉన్నాయి. బ్రెజిల్‌, ఆస్ట్రేలియా, చైనాలోనూ అధిక శాతం తొలగింపులు జరిగాయి.

ఎక్కువగా 30 శాతం ఉద్యోగ కోతలు ఎడ్యుటెక్‌ సంస్థలు ఉద్యోగులను తొలగించాయి. ఆ తరువాత ఆహార తయారీ సంస్థలు, రిటైల్‌ , కన్జ్యూమర్‌, ఆరోగ్య సంరక్షణ కంపెనీలున్నాయి.

#layoff #tech
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe