Indian Students Died: విదేశాల్లో తెలుగు విద్యార్థులు మృత్యువాత

గత కొన్ని రోజులుగా విదేశాల్లో రోడ్డు ప్రమాదాల్లో తెలుగు విద్యార్థులు మృతి చెందడం కలకలం రేపుతోంది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ వాసి అరటి అరవింద్ యాదవ్ ఆస్ట్రేలియాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అలాగే అమెరికాలో రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన అచ్యుత్ మృతి చెందాడు.

New Update
sycho Medchal

Indian Students Died: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ వాసి అరటి అరవింద్ యాదవ్ (30) ఆస్ట్రేలియాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. షాద్‌నగర్‌ బీజేపీ నేత అరటి కృష్ణ ఏకైక కుమారుడు అరవింద్.. ఉద్యోగరీత్యా సిడ్నీలో స్థిరపడ్డాడు. ఐదు రోజుల క్రితం నుంచి కనిపించకుండా పోగా కుటుంబ సభ్యులు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గత సోమవారం స్వదేశానికి వచ్చేందుకు కుటుంబ సభ్యులతో అరవింద్ (Aravind Yadav) ఏర్పాట్లు చేసుకున్నారని బంధువులు తెలిపారు. ఆస్ట్రేలియాలో వాతావరణం పడకపోవడంతో వారం రోజుల క్రితం తల్లి ఉషారాణి షాద్‌నగర్‌ వచ్చింది. సోమవారం అరవింద్ కుటుంబంతో కలిసి స్వగ్రామానికి వచ్చేందుకు విమాన టికెట్లు బుక్ చేసుకున్నాడు. అతడి భార్య గర్భిణి. కారు వాష్ చేయించుకుని వస్తానని చెప్పిన అరవింద్‌ తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.

ఈ నేపథ్యంలో సముద్రంలో ఓ యువకుడి శవం లభ్యమైనట్టు స్థానిక పోలీసులు గుర్తించారు. డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించి ఆ శవం అరవింద్‌దేనని ధ్రువీకరించారు. అతడిది హత్యా ? లేక ఆత్మహత్యా ?అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

అమెరికాలో తెలుగు విద్యార్ధి మృతి..

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. ఏపీకి చెందిన అచ్యుత్.. స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ లో చదువుతున్నాడు. బుధవారం సాయంత్రం అతడు ఇక్కడ ద్విచక్రవాహన ప్రమాదంలో చనిపోయాడని భారత కాన్సు లేట్ జనరల్ 'ఎక్స్' లో తెలిపింది. మృతదేహాన్ని స్వదే శానికి పంపించడానికి అతడి కుటుంబ సభ్యులకు సహకారం అందిస్తామని చెప్పింది. అచ్యుత్ ఊరు, తల్లిదండ్రుల వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు