Railway Rules : ట్రైన్‌లో మద్యం బాటిళ్లు తీసుకెళ్తున్నారా? ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!

ట్రైన్ జర్నీ చేస్తున్నారా? మీ వెంట మద్యం, మత్తు పదార్థాలు, పేలుడు పదార్థాలు, రసాయనాలు, గ్యాస్ సిలిండర్లు సహా కొన్ని వస్తువులు తీసుకెళ్లడం నిషిద్ధం. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి తీసుకెళ్తే.. భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష విధించే అవకాశం కూడా ఉంది.

New Update
Indian Railways Record: లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఇండియన్ రైల్వేస్.. ఎందుకంటే.. 

Indian Railways Rules : భారతదేశం(India) లో ఎక్కువ శాతం ప్రజా రవాణా జరిగేది రైల్వే(Indian Railway) వ్యవస్థ ద్వారానే అని చెప్పొచ్చు. సుదూర ప్రయాణాలు సాగించే ప్రజలు.. రైళ్లలో జర్నీకి ఆసక్తి చూపుతారు. ట్రైన్ టికెట్ ధర తక్కువగా ఉండటం, వేగవంతంగా గమ్యం చేరుకోవడం, ప్రయాణం కూడా సౌకర్యవంతంగా ఉండటంతో ఎక్కువగా జనాలు ట్రైన్ జర్నీకి ప్రాధాన్యత ఇస్తారు. అందులోనూ లగేజ్ తీసుకెళ్లడానికి కూడా వీలుగా ఉంటుంది. అయితే, లగేజీ విషయంలో రైల్వే చట్టం ప్రకారం కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. మాదక ద్రవ్యాలు, మద్యం రవాణాకు రైల్వే నిబంధనలు అంగీకరించవు. అంతేకాదు.. మద్యం సేవించిగానీ.. ఇతర మత్తు పదర్థాలు తీసుకుని గానీ రైల్వే ప్రయాణించడానికి అనుమతి లేదు. ఒకవైళ ఎవరైనా మద్యం మత్తులో ట్రైన్ ప్రయాణం చేసినా.. ట్రైన్‌లో మద్యం బాటిళ్లను తీసుకెళ్లినా.. రైల్వే చట్టం ప్రకారం శిక్షార్హులు అవుతారు. రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 165 ప్రకారం.. మద్యం, నిషేధిత వస్తువులు అక్రమ రవాణా చేస్తే జైలు శిక్షతో పాటు, భారీ జరిమానా విధించే అవకాశం ఉంది. ఇక సెక్షన్ 145 ప్రకారం.. రైల్వే ప్రాంగణంలో గానీ.. ట్రైన్‌లో గానీ.. ఎవరైనా మద్యం, మత్తు పదార్థాలు సేవిస్తే సదరు వ్యక్తులను అరెస్ట్ చేస్తారు. దాంతోపాటు జరిమానా కూడా విధిస్తారు.

ఈ విషయం తెలుసా?

రైల్వే నిబంధనల(Railway Rules) ప్రకారం.. రైళ్లలో కొన్ని వస్తువులు తీసుకెళ్లడంపై నిషేధం ఉంటుంది. ట్రైన్‌లో మంటలు చెలరేగే అవకాశం ఉన్న వస్తువులు, ట్రైన్‌ను మురికమయంగా మార్చే వస్తువులు, ప్రమాదకారకాలను ట్రైన్‌లో తీసుకెళ్లనివ్వరు. ప్రమాదకరం కాని లగేజీని లగేజీ వ్యాన్‌తో తీసుకెళ్లడానికి అనుమతిస్తారు. ఉదాహరణకు వంట పొయ్యి, గ్యాస్ సిలిండర్లు, రసాయనాలు, బాణా సంచా, తడి పదార్థాలు, ప్యాకెట్లలో తరలించే నూనె సహా మరికొన్ని వస్తువులను ట్రైన్‌లో తీసుకెళ్లడానికి అనుమతి నిరాకరిస్తారు రైల్వే అధికారులు. అయితే, రైల్వే చట్టం ప్రకారం.. ప్రయాణికులు 20 కిలోల వరకు నెయ్యిని తీసుకెళ్లవచ్చు. అదికూడా నెయ్యి/నూనె టిన్ బాక్స్‌లో మంచిగా ప్యాక్ చేసి ఉండాలి.

అలా చేస్తే జైలు శిక్షే..

రైల్వే నిబంధనల ప్రకారం ట్రైన్ ప్రయాణంలో నిషేధిత వస్తువులు తీసుకెళ్లడం నేరపూరిత చర్య. రైల్ ప్రయాణంలో ఏవైనా నిషేధిత వస్తువులు ప్యాసింజర్ వద్దు పట్టుబడితే సదరు వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష, రూ. 1000 జరిమానా విధించే అవకాశం ఉంది. అందుకే.. ట్రైన్‌లో ప్రయాణించేవారు.. తమ వెంట ఏవైనా వస్తువులు తీసుకెళ్లేవారు ముందుగా ట్రైన్ రూల్స్ తప్పక తెలుసుకోవాలి.

Also Read:

హైదరాబాద్‌లో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్.. చుక్కలు చూస్తున్న వాహనదారులు.. ఇదిగో వీడియోలు!

తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం.. ఢీకొన్న రెండు కార్లు..

Advertisment
Advertisment
తాజా కథనాలు