Olympic Players: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మన ఒలింపిక్ క్రీడాకారులు.. భారత ఒలింపిక్ క్రీడాకారులు ఈరోజు ఢిల్లీ చేరుకుంటారు. ఈ సాయంత్రం క్రీడాకారులతో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైటీ కార్యక్రమంలో పాల్గొంటారు. రేపు అంటే ఆగస్టు 15న ఎర్రకోట వద్ద జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం వీరు ప్రధాని మోదీని కలుస్తారు. By KVD Varma 14 Aug 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి Olympic Players: పారిస్ ఒలింపిక్స్ ముగియడంతో ఈ మహా క్రీడా సంగ్రామంలో పాల్గొనేందుకు వెళ్లిన క్రీడాకారులు తమ తమ దేశాలకు బయలుదేరారు. భారత ఒలింపిక్ ఆటగాళ్ల బృందం కూడా స్వదేశానికి బయలుదేరింది. ఈరోజు ఢిల్లీ చేరుకుంటుంది. రేపు అంటే ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటలో జరిగే వేడుకల్లో భారత ఆటగాళ్ల బృందం పాల్గొంటుంది. ఆ తర్వాత వీరంతా ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తారు. భారత ఒలింపిక్ బృందం బుధవారం ఉదయం పారిస్ నుంచి ఢిల్లీ చేరుకుంటుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు హై టీ కోసం ఈ ఆటగాళ్లను కలవనున్నారు. ఆగస్టు 15వ తేదీ గురువారం ఎర్రకోటలో నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఈ క్రీడాకారులు పాల్గొంటారు. దీని తర్వాత ఆటగాళ్లు ప్రధానమంత్రి అధికారిక నివాసానికి వెళతారు. ప్రధాని నరేంద్ర మోడీ వీరితో మధ్యాహ్నం 1 గంటలకు ఇక్కడ సమావేశమవుతారు. ఆటగాళ్లకు ప్రధాని మోదీ అభినందనలు.. Olympic Players: అంతకుముందు, ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం పారిస్ ఒలింపిక్ క్రీడల ముగింపు వేడుకల సందర్భంగా భారత జట్టు ప్రయత్నాలను ప్రశంసించారు. రాబోయే క్రీడా పోటీలకు ఆటగాళ్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఒలింపిక్స్‌లో ఆటగాళ్లందరూ తమ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చారని, వారి కృషికి ప్రతి భారతీయుడు గర్విస్తున్నాడని ప్రధాని మోదీ అన్నారు. ‘పారిస్ ఒలింపిక్స్ ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో, ఆ క్రీడల సందర్భంగా మొత్తం భారత బృందం చేసిన ప్రయత్నాలను నేను అభినందిస్తున్నాను’ అని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో ప్రధాని మోదీ అన్నారు. అయన ఇంకా మాట్లాడుతూ, “ప్యారిస్‌లో ఆటగాళ్లందరూ తమ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చారు. ప్రతి భారతీయుడు వారిని చూసి గర్విస్తున్నాడు. మన క్రీడా హీరోలకు వారి రాబోయే ప్రయత్నాలకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.’’ అని చెప్పారు. పారిస్‌లో భారత్ కు 6 పతకాలు.. Olympic Players: 47 మంది మహిళా అథ్లెట్లతో సహా 117 మంది క్రీడాకారులు పారిస్ ఒలింపిక్ క్రీడలకు భారతదేశం నుండి వెళ్లారు. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేతలు పిఆర్ శ్రీజేష్ (హాకీ), మను భాకర్ (షూటింగ్) ఆదివారం జరిగిన ముగింపు వేడుకలో దేశాల పరేడ్‌లో జెండా బేరర్లుగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. Olympic Players: అయితే, టోక్యో ఒలింపిక్ గేమ్స్ 2020తో పోల్చితే ఈసారి ఒలింపిక్స్‌లో భారత్ ప్రదర్శన కాస్త తక్కువగానే ఉంది. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఒక రజత పతకంతో సహా ఆరు పతకాలు సాధించింది. షూటర్ మను భాకర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో కాంస్య పతకాన్ని, ఆపై 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. స్వాతంత్య్రం తర్వాత ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది #paris-olympics-2024 #olympic-players మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి